బంగారం, వెండి ధరలు నేడు (మే 10, సోమవారం) భారీగా పెరిగాయి. పసిడి ఏకంగా రూ.48,000 క్రాస్ చేయగా, సిల్వర్ ఫ్యూచర్స్ రూ.72,000 దాటి రూ.73వేల దిశగా పరుగులు పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ 1850 డాలర్ల వైపు, వెండి 28 డాలర్ల వైపు కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం, క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులకు ఆచితూచి వ్యవహరిస్తుండటం పసిడికి కలిసి వచ్చింది. అంతర్జాతీయంగా బంగారం ధరలకు మద్దతు లభించడంతో దేశీయంగా కూడా పెరిగాయి. దేశీయంగా ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో బంగారం రూ.8200 తక్కువగా ఉంది.

భారీగా పెరిగిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.243.00 (0.51%) పెరిగి రూ.47994.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,820.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,050.00 గరిష్టాన్ని, రూ.47,755.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.258.00 (0.54%) పెరిగి రూ.48391.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,141.00 వద్ద ప్రారంభమై, రూ.48,421.00 గరిష్టాన్ని, రూ.48,141.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.72వేలు దాటిన వెండి
వెండి ఫ్యూచర్ ధరలు నేడు భారీగా పెరిగాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.1,051.00 (1.47%) పెరిగి రూ.72480.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,507.00 వద్ద ప్రారంభమై, రూ.72,665.00 గరిష్టాన్ని, రూ.71,507.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,162.00 (1.60%) పెరిగి రూ.73566.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.73,028.00 ప్రారంభమైన ధర, రూ.73,592.00 వద్ద గరిష్టాన్ని, రూ.73,004.00 కనిష్టాన్ని తాకింది.

1850 డాలర్ల దిశగా...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు భారీగా పెరిగాయి. 1835 డాలర్లను క్రాస్ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 6.40 (0.35%) డాలర్లు పెరిగి 1,837.70 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,830.60 - 1,839.60 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.408 (1.48%) డాలర్లు పెరిగి 27.885 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.590 - 27.957 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications