Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు, వెండి నేటి హై-నుండి రూ.500 డౌన్
బంగారం ధరలు నేడు (జూలై 1, గురువారం) సాయంత్రం స్థిరంగా ఉన్నాయి. నిన్న స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు నేడు ఉదయం స్వల్పంగా పెరిగాయి. రెండు రోజుల క్రితం గోల్డ్ ఫ్యూచర్స్ రూ.400 క్షీణించింది. నిన్న మాత్రం పెరిగింది. నేడు ఉదయం రూ.47,000ను క్రాస్ చేసింది. కానీ సాయంత్రానికి ఈ మార్కు దిగువకు వచ్చింది. ఇటీవలి వరకు రూ.68వేల దిగువన ఉన్న సిల్వర్ ఫ్యూచర్స్ నిన్ననే ఈ మార్కును క్రాస్ చేసింది. నేడు ఉదయం మరో రూ.600 వరకు పెరిగినా సాయంత్రానికి మళ్లీ అదే స్థాయిలో తగ్గింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.రూ.9300 తక్కువగా ఉన్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.11వేలకు పైగా తక్కువగా ఉంది.

పెరిగిన బంగారం ధరలు
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో రూ.125.00 (0.27%) పెరిగి రూ.46964.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,930.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,210.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.46,903.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.146.00 (0.31%) పెరిగి రూ.47250.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,250.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,450.00 గరిష్టాన్ని, రూ.47,200.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి స్థిరంగా..
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.40.00 (0.06%) పెరిగి రూ.68175.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,633.00 వద్ద ప్రారంభమై, రూ.68,912.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.68,175.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.36.00 (0.05%) పెరిగి రూ.69110.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,400.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,000.00 గరిష్టాన్ని, రూ.69,040.00 కనిష్టాన్ని తాకింది. ఉదయం రూ.68,700 పైన పలికిన వెండి సాయంత్రానికి రూ.68,200 దిగువకు వచ్చింది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు స్వల్పంగా తగ్గాయి. 1770 డాలర్ల దిగువనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 1.90
(0.11%) డాలర్లు తగ్గి 1,769.70 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,766.00 - 1,783.30 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. 0.107 (0.41%) డాలర్లు పెరిగి 26.058 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.052 - 26.523 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications