దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు నేడు స్వల్పంగా క్షీణించాయి. గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,000 దిగువనే ట్రేడ్ అవుతోంది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.68,000కు దిగువన ఉంది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.9300 తక్కువగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టంతో రూ.12000 తక్కువగా ఉంది. యూఎస్ ఫెడ్ రిజర్వ్ మానిటరీ పాలసీ నిర్ణయాలు, అంచనాల ప్రభావం పసిడి పైన ఉంది. ప్రపంచ అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కంపెనీ ఎస్పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ వద్ద బంగారం నిల్వలు 0.3 శాతం పెరిగి 1045.78 టన్నులకు చేరుకున్నాయి.

స్థిరంగా బంగారం ధరలు
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి మధ్యాహ్నం సెషన్లో రూ.78.00 (0.17%) తగ్గి రూ.46930.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,880.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,970.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.46,857.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.71.00 (0.15%) తగ్గి రూ.47217.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,200.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,218.00 గరిష్టాన్ని, రూ.47,170.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధరలు కూడా డౌన్
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ మధ్యాహ్నం సెషన్లో రూ.162.00 (-0.24%) తగ్గి రూ.67979.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,869.00 వద్ద ప్రారంభమై, రూ.68,145.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.67,790.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.177.00 (-0.26%) తగ్గి రూ.69056.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,947.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,130.00 గరిష్టాన్ని, రూ.68,871.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 6.55 (0.37%) డాలర్లు తగ్గి 1,774.15 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,773.70 - 1,779.15 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. 0.093 (0.35%) డాలర్లు పెరిగి 26.130 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.050 - 26.210 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications