తగ్గిన బంగారం ధరలు: హైదరాబాద్, విజయవాడల్లో ఎంత ఉందంటే?
బంగారం ధరలు ఈరోజు(సెప్టెంబర్ 12, శనివారం) స్వల్పంగా తగ్గాయి. వివిధ నగరాలను చూస్తే విజయవాడ, విశాఖ, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.48,980, 24 క్యారెట్ల పసిడి రూ.53,440 పలికింది. 22 క్యారెట్లు, 24 క్యారెట్ల పసిడి వరుసగా చెన్నైలో రూ.48,980, రూ.53,440, ముంబైలో రూ.49,460, రూ.50,460, ఢిల్లీలో రూ.49,910, 54,440, కోల్‌కతాలో రూ.50,510, రూ.53,210, బెంగళూరులో రూ.48,410, రూ.52,810 పలికింది.

పదిరోజుల్లో రూ.100 మాత్రమే పెరుగుదల
గత పదిరోజులను పరిగణలోకి తీసుకుంటే పసిడి ధరల్లో పెద్దగా మార్పులేదు. గత నెల 7వ తేదీన ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ.56,200 దాటి రికార్డ్ గరిష్టానికి చేరుకుంది. ఆ తర్వాత రష్యా వ్యాక్సీన్ రావడంతో రూ.51వేల స్థాయికి దిగి వచ్చింది. అయితే నెల రోజులగా దాదాపు ఇక్కడే పైకి, కిందకు కదులుతోంది. సెప్టెంబర్ 3న రూ.49,350గా ఉన్న పసిడి స్వల్పంగా తగ్గుతూ, పెరుగుతూ ఈ రోజు రూ.49,460 పలికింది. అంటే ఈ పది రోజుల్లో రూ.100 మాత్రమే పెరిగింది. 24 క్యారెట్ల పసిడి రూ.50,340 నుండి రూ.50,460 పలికింది.

రూ.300 తగ్గుదల
హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లో శనివారం రూ.300 తగ్గింది. 22 క్యారెట్ల పసిడి రూ.270 తగ్గుముఖం పట్టింది. పసిడి ధరతో పాటు వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. కిలో వెండి ధర రూ.600 వరకు తగ్గింది. దీంతో కిలో ధర రూ.67,980 పలికింది. పరిశ్రమ యూనిట్లు, నాణేల తయారీదారుల నుండి డిమాండ్ మందగించింది.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్‌కు 0.82 శాతం తగ్గి 1942 డాలర్లకు దిగి వచ్చింది. వెండి ధర కూడా ఔన్స్ 1.38 శాతం తగ్గి 26.91 డాలర్లు పలికింది. అమెరికా - చైనా ట్రేడ్ వార్, భారత్ - చైనా సరిహద్దు టెన్షన్, డాలర్ వ్యాల్యూ, ఈక్విటీ వ్యాల్యూ, ప్రస్తుతం కరోనా మహమ్మారి-వ్యాక్సీన్ అంశం బంగారంపై ప్రభావం చూపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications