For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price today: బంగారం ధరలు ఇక్కడ తగ్గి, అక్కడ పెరుగుదల

|

వరుసగా మూడు రోజుల పాటు తగ్గిన బంగారం ధరలు నేడు (ఏప్రిల 22, శుక్రవారం) స్వల్పంగా పెరిగాయి. నేడు దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో దాదాపు స్థిరంగా ఉండగా, అంతర్జాతీయ మార్కెట్‌లో స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. ఈ వార్త రాసే సమయానికి జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.208 క్షీణించి రూ.52,420 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.226 తగ్గి రూ.52,660 వద్ద ట్రేడ్ అయింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.4000 వరకు తక్కువగా ఉంది.

సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67,000 స్థాయికి వచ్చింది. ఇటీవల రూ.70,000 క్రాస్ చేసిన సిల్వర్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.భారీగా తగ్గింది. నేటి ప్రారంభ సెషన్‌లో మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.45 తగగి రూ.67,080 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.63 క్షీణించి రూ.67,850 వద్ద ట్రేడ్ అయింది.

Gold Price today: Yellow metal above $1,950 in international market

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు స్వల్పంగా పెరగగా, సిల్వర్ ధరలు మాత్రం క్షీణించాయి. గోల్డ్ ఫ్యూచర్స్ (జూన్ 22) కామెక్స్‌లో నేడు 3.80 డాలర్లు పెరిగి 1952 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.043 డాలర్లు క్షీణించి 24.578 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1948 డాలర్ల వద్ద ముగిసింది.

English summary

Gold Price today: బంగారం ధరలు ఇక్కడ తగ్గి, అక్కడ పెరుగుదల | Gold Price today: Yellow metal above $1,950 in international market

Gold Price is resuming its downtrend, looking to retest the $1,935 demand area, as the US dollar holds onto its recovery gains amid firmer Treasury yields.
Story first published: Friday, April 22, 2022, 10:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X