భారతదేశంలో బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. బంగారు ఆభరణాలను పెట్టుకుని మురిసిపోయే వారే కాకుండా, బంగారం పైన పెట్టుబడి పెట్టేవారు కూడా భారతదేశంలో ఎక్కువగానే ఉన్నారు. ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు బంగారం కొనుగోలుదారులకు ఇబ్బందిగా మారాయి. కొనుగోలు చెయ్యాలంటే భయపడేలా చేస్తున్నాయి. ఇక పెట్టుబడిదారులు సైతం బంగారం పెరుగుదల నేపథ్యంలో ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది.

హెచ్చుతగ్గులతో రోజుకో రకంగా బంగారం ధరలు
ఈ సంవత్సరం ప్రారంభం నుంచి బంగారం ధరల పెరుగుదల దేశంలో హాట్ టాపిక్ గా మారింది. రెండేళ్ల గరిష్టానికి బంగారం ధరలు పెరగడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. బంగారం ధరలు తగ్గడం, బంగారం ధర పెరుగుదలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఇక తాజాగా బంగారం ధరలలో దూకుడు మాత్రం కనిపించలేదు. నేడు దేశంలో 24 క్యారెట్ల, 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా ఉన్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఫిబ్రవరి 13 నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర భారతదేశంలో రూ. 57,040 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 52, 250 గా కొనసాగుతుంది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో బంగారం ధరలు ఇలా
భారతదేశంలోని ప్రధాన నగరాలు బంగారం ధరలలో హెచ్చుతగ్గులను నమోదు చేశాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,600 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,380గా కొనసాగుతుంది. ఇక విజయవాడలో బంగారం ధర నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 52,600 రూపాయలు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 57,380 రూపాయలుగా కొనసాగుతుంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 52,600 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 57,380 రూపాయలుగా కొనసాగుతుంది.

ఢిల్లీ, ముంబైలలో బంగారం ధరలు ఇలా
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,750 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,530 రూపాయలు గా ట్రేడ్ అవుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,600 రూపాయలుగా కొనసాగుతుండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,380గా ట్రేడ్ అవుతుంది.

దేశంలో వెండి ధరలు ఇలా
ఇదిలా ఉంటే దేశంలో వెండి విషయానికి వస్తే.. బంగారం తో పాటు వెండి కూడా దేశంలో గణనీయంగా పెరుగుతుంది. గ తేడాది నవంబర్లో కిలో బండి 64,000 ఉంటే రెండు నెలల్లోనే దాదాపు 8,000 వరకు వెండి పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుత హైదరాబాద్ లో వెండి ధరలు 72,700 వద్ద ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే గత మూడు సెషన్లలో 900 రూపాయల మేర తగ్గిన వెండి ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతుంది. ఏది ఏమైనా బంగారం, వెండి ధరలు గతానికి భిన్నంగా విపరీతంగా పెరగడం మాత్రం కొనుగోలుదారులకు షాక్ ఇస్తుంది. ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని బంగారం ప్రియులు ఆశగా ఎదురు చూసేలా చేస్తున్నాయి.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..



Click it and Unblock the Notifications