బంగారం ధరలు క్షీణిస్తున్నాయి. ఎంసీఎక్స్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.46,000 దిగువకు పడిపోయింది. మధ్యాహ్నం గం.11 సమయానికి అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.67.00 (-0.15%) క్షీణించి రూ.45989.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.77.00 (-0.17%) తగ్గి రూ.46100.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు నిన్న పడిపోయాయి. అయితే నేడు స్వల్పంగా పుంజుకున్నాయి. నిన్న గోల్డ్ ఫ్యూచర్స్ 1750 డాలర్ల దిగువన ముగిశాయి.
నేడు మూడు డాలర్ల మేర పెరిగి 1753.70 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఎంసీఎక్స్‌లో వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గాయి. నేటి ప్రారంభ సెషన్‌లో రూ.139.00 (-0.23%) క్షీణించి రూ.60650.00 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.152.00 (-0.25%) తగ్గి రూ.61322.00 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 23 డాలర్ల దిగువనే ఉంది. నేడు 0.013 డాలర్ల మేర క్షీణించి 22.692 వద్ద ట్రేడ్ అయింది.

నిన్న భారీగా తగ్గుదల
బంగారం ధరలు నిన్న భారీగా పడిపోయాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో దాదాపు రూ.600 మేర తగ్గింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్నటి సెషన్‌లో రూ.597.00 (-1.28%) తగ్గి రూ.46,075.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.659.00 (-1.41%) క్షీణించి రూ.46,158.00 వద్ద ముగిసింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వారం రూ.46,000 దిగువన ప్రారంభమైంది. కానీ చైనా ఎవర్ గ్రాండ్ వంటి వివిధ కారణాలతో రూ.46,700 దాటి, రూ.47,000 దిశగా కనిపించింది.
కానీ అమెరికా ఫెడ్ ప్రకటన, ఎవర్ గ్రాండ్ ఊరట ప్రకటన, దేశంలో కరోనా కేసులు తగ్గడం వంటి వివిధ అంశాలు కలిసి వచ్చి మళ్లీ బంగారంపై ఒత్తిడి తగ్గింది. దీంతో పసిడి ధరలు మళ్లీ రూ.46,000 స్థాయికి పడిపోయాయి. ఈ రెండు రోజుల్లోనే రూ.700 వరకు తగ్గింది. ఇక సిల్వర్ ఫ్యూచర్స్ ఈ వారం ప్రారంభంలో రూ.60,000 దిగువన ప్రారంభమై, ఆ తర్వాత రూ.63,000 స్థాయికి చేరుకుంది. వరుసగా తగ్గి నిన్న రూ.61,000 దిగువన ముగిసింది.

అందుకే బంగారంపై ఒత్తిడి తగ్గింది
ఫెడ్ రిజర్వ్ ప్రకటన, అంతర్జాతీయంగా కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడం, అంతర్జాతీయ మార్కెట్లు పరుగులు తీస్తుండటం వంటి అంశాలు బంగారం పైన ప్రభావం చూపాయి. బాండ్స్ కొనుగోలును నవంబర్ నుండి తగ్గిస్తామని ఫెడ్ రిజర్వ్ ప్రకటించింది, దీంతో వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే బంగారంపై పెట్టుబడి తగ్గుతుంది. ఈ నేపథ్యంలో పసిడిపై ఒత్తిడి తగ్గింది.

వచ్చే వారం కూడా ఇలాగే
బంగారం ధరలు వచ్చే వారం కూడా పతనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ సరైన పథంలో ఉందని యూఎస్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ వెల్లడిస్తోంది. ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పినట్లయితే మాత్రమే ద్రవ్య విధానాలను కఠినతరం చేయడానికి ఫెడ్ ప్రణాళికలు ఉంటాయి. కానీ రికవరీ కనిపిస్తోంది. అలాగే, చైనీస్ రియాల్టీ దిగ్గజం ఎవర్ గ్రాండ్ ప్రకటన నేపథ్యంలో ఆర్థిక మార్కెట్లలో ప్రభావం కనిపించకపోవచ్చు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు సానుకూలంగా ఉండకపోవచ్చునని చెబుతున్నారు.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications