విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో తాజాగా బంగారం ధర ఔన్స్ కు 1950 డాలర్లకు తగ్గింది. వెండి ధర కూడా ఈరోజు తగ్గుముఖం పట్టి ఔన్స్ కు 23.58 డాలర్లకు చేరుకుంది. దీంతో దేశీయంగానూ బంగారం, వెండి ధరలు తగ్గాయి.
నేడు తగ్గిన బంగారం ధరలు
ఇదిలా ఉంటే తాజాగా దేశీయంగాను బంగారం ధరల విషయానికి వస్తే దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మీద 300 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మీద 330 రూపాయల మేర ధర తగ్గింది. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 54,700 వద్ద ట్రేడ్ అవుతుంది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,670 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.

ఢిల్లీ, ముంబై, బెంగళూరులో బంగారం ధరలిలా
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,850 వద్ద ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,820 రూపాయల వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,700గా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 59,670 రూపాయలుగా కొనసాగుతుంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 54,750 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,720 రూపాయలుగా విక్రయించబడుతుంది.
ఏపీ, చెన్నై లో బంగారం ధరలు
ఇక విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,700గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,670 రూపాయలుగా విక్రయించబడుతుంది. దేశంలోనే అత్యధికంగా ధరలు ఉండే చెన్నైలో మాత్రం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల రూపాయలను మించి కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60,380 కాగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,350 గా ప్రస్తుతం విక్రయించబడుతుంది.

తమిళనాడులో అత్యధికంగా బంగారం ధరలు
చెన్నైలో మాత్రమే కాకుండా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్, మధురై, సేలం, తిరుచ్చి, తిరుపూరు, తిరునవ్వేలి, ఈ రోడ్ లలోను 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,350 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,380 రూపాయలుగా విక్రయించబడుతుంది. స్థానికంగా ఉండే పన్నులను బట్టి బంగారం ధరలలో కొద్దిపాటి మార్పులు ఉంటాయి అనేది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం.
బంగారం ధర తగ్గటానికి కారణాలు ఇవే
అంతర్జాతీయ ప్రభావాలు కూడా బంగారం ధరల పైన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల రికవరీ వల్ల పసిడి నుంచి పెట్టుబడులు మళ్ళుతున్న పరిస్థితి ఉంది. బ్యాంకింగ్ రంగ పరిణామాలు కూడా బంగారం ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అంతేకాకుండా OPEC ప్లస్ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించడంతో చమురు ధరలు ఐదు శాతానికి పెరగడంతో బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.


Click it and Unblock the Notifications