For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price Today: రూ.51,000 సమీపానికి చేరిన బంగారం ధరలు

|

బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. ఇటీవల రూ.50,000 దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.51,000కు చేరుకున్నాయి. నేడు మధ్యాహ్నం గం.12.45 సమయానికి జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.100 పెరిగి రూ.50,929 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.106 పెరిగి రూ.51,129 వద్ద ట్రేడ్ అయ్యాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో చూస్తే రూ.5200కు పైగా తక్కువగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా ఇటీవల రూ.60,000 దిగువకు పడిపోయినప్పటికీ, ఇప్పుడు రూ.62,000 దిశగా వెళ్తోంది.

అంతర్జాతీయ మార్కెట్లో గతవారం ఓ సమయంలో 1810 డాలర్ల దిగువన ట్రేడ్ అయిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇటీవల పెరుగుతోంది. నేడు గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా 11 డాలర్లు లాభపడి 1853 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.259 డాలర్లు ఎగిసి 21.928 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో 220 డాలర్లకు పైగా తక్కువగా ఉంది.

Gold price in India surged to more than one-week high on Monday, following the global gold rates.

బంగారం ధరలు నాలుగు నెలల కనిష్టం వద్ద ఉన్నాయి. ఫెడ్ వడ్డీ రేటు పెంపు, ఇతర దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీ రేటు పెంపు నేపథ్యంలో పసిడి ధరలు గతవారం భారీగా పడిపోయాయి. స్టాక్ మార్కెట్లు కూడా నష్టపోయాయి. అయితే గత రెండు మూడు సెషన్లుగా పసిడి ధరలు పెరుగుతున్నాయి.

English summary

Gold Price Today: రూ.51,000 సమీపానికి చేరిన బంగారం ధరలు | Gold Price Today Surges to Rs 51,000

Gold price in India surged to more than one-week high on Monday, following the global gold rates.
Story first published: Monday, May 23, 2022, 12:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X