ఆల్ టైమ్ గరిష్టం నుండి రూ.10,000 తక్కువగా బంగారం ధరలు

బంగారం ధరలు నేడు(అక్టోబర్ 4, సోమవారం) స్థిరంగా ఉన్నాయి. నేటి ప్రారంభ సెషన్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.3.00 (-0.01%) క్షీణించి రూ.46283.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.7.00 (-0.02%) క్షీణించి రూ.46499.00 వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో -4.65 (-0.26%) డాలర్లు క్షీణించి 1,753.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఎంసీఎక్స్‌లో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.33.00 (-0.05%) క్షీణించి రూ.60517.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.27.00 (-0.04%) క్షీణించి రూ.61000.00 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.044 (-0.20%) డాలర్లు క్షీణించి 22.492 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ గతవారం రూ.46,283 వద్ద ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో 1760 డాలర్ల దిగువన ముగిశాయి.

రూ.10,000 తక్కువ

రూ.10,000 తక్కువ

గోల్డ్ ఫ్యూచర్ ధరలు గతవారం రూ.46,000 దిగువన ప్రారంభమై, రూ.46,286 వద్ద ముగిశాయి. నేడు స్థిరంగా ఉన్నాయి. గోల్డ్ ఫ్యూచర్స్ రూ.46 వేల పైనే ట్రేడ్ అవుతున్నాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే ఇప్పటికీ రూ.10,000 తక్కువగా ఉంది. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్ ఈవారం రూ.45,907 వద్ద స్టాప్ లాస్‌తో రూ.46,100కు సమీపంలో లాంగ్ పొజిషన్లు తీసుకోవచ్చు.

ఒకవేళ రూ.45,907 కంటే కిందకు వస్తే ఫ్యూచర్ రూ.45,315 స్థాయికి పడిపోయే అవకాశముందని భావిస్తున్నారు. ఒకవేళ రూ.46,890 స్థాయిని అధిగమిస్తే రూ.47,280 వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్ రూ.58,135 దిగువకు వస్తే రూ.57,400కు పడిపోయే అవకాశాలు ఉన్నాయని, రూ.61,000ను క్రాస్ చేస్తే రూ.62,000కు కూడా చేరుకోవచ్చునని చెబుతున్నారు.

బాండ్ యీల్డ్స్

బాండ్ యీల్డ్స్

అమెరికాలో టెన్ ఇయర్ బాండ్స్ ఈల్డ్ పెరగడం రూపాయి మారకపు విలువ క్షీణించడం, అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలు, క్రూడాయిల్ ధరలు ధరల పెరుగుదల, డాలర్ క్రమంగా బలపడటం వంటి అంశాలు పసిడి పైన ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయంగా కరోనా డెల్టా వేరియంట్ ఆర్థిక రికవరీపై ప్రభావం చూపవచ్చుననే అభిప్రాయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రపంచ అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఎస్పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ వద్ద బంగారు నిల్వలు శుక్రవారం నాటికి 0.4 శాతం తగ్గి 986.54 టన్నులకు తగ్గాయి.

ద్రవ్యోల్భణం ప్రభావం

ద్రవ్యోల్భణం ప్రభావం

బంగారం ధరలపై ద్రవ్యోల్భణం ప్రభావం ఉంటుంది. కేంద్ర బ్యాంకు ఉద్దీపనలు, వడ్డీ రేట్ల పెంపు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. వడ్డీ రేట్లు పెరిగితే బంగారం ధరలు తగ్గే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 1750 డాలర్లకు కాస్త పైన ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ 22.51 డాలర్ల వద్ద, ప్లాటినమ్ 0.1 శాతం క్షీణించి 971.22 డాలర్ల వద్ద ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+