భారీగా తగ్గిన బంగారం ధర: పసిడి డిమాండ్ ఎందుకు తగ్గిందంటే?

జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుదలను నమోదు చేశాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధర ఇప్పుడు తగ్గుతోంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,050 తగ్గి రూ.44,870 పలికింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,680కి దిగి వచ్చింది. వెండి ధర మాత్రం పెరిగింది. రూ.600 వరకు పెరిగి రూ.48 వేలను దాటింది. హైదరాబాద్, కోల్‌కతా, ఢిల్లీ, ముంబై నగరాల్లోను ధరలు తగ్గాయి.

ఇతర నగరాల్లో బంగారం ధరలు..

ఇతర నగరాల్లో బంగారం ధరలు..

బంగారం ధరలు కాస్త తగ్గినప్పటికీ, ఈ ఏడాది నుండి చూస్తే మాత్రం భారీగానే పెరిగాయి. కరోనా మహమ్మారి అనంతరం రూ.40వేల లోపు ఉన్న బంగారం ధర ఏకంగా ఇప్పుడు రూ.48వేల పైకి చేరుకుంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.49,010, ముంబైలో రూ.48,280, ఢిల్లీలో రూ.47,930గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో..

సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ 0.5 శాతం తగ్గి 1,726.18 డాలర్లు పలికింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.5 శాతం పెరిగి 1,726.60 డాలర్లుగా ఉంది. అయినప్పటికీ బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 1,740 డాలర్ల నుండి 1,750 మధ్యకు చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం పసిడి ధర 0.8 శాతం పెరిగి 1,739.51 పలికింది. ఆ తర్వాత ఇప్పుడు తగ్గింది. అయితే ఇప్పటికీ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

బంగారం ధరలు ఎందుకు తగ్గాయి

బంగారం ధరలు ఎందుకు తగ్గాయి

అంతర్జాతీయ మార్కెట్లు స్వల్పంగా కోలుకుంటున్నాయి. దీంతో బంగారంపై ఒత్తిడి తగ్గుతోంది. జపాన్ ఈక్విటీస్ సోమవారం పెరిగాయి. అదే సమయంలో ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఇది కూడా మార్కెట్ సెంటిమెంటును బలపరిచింది. దీంతో బంగారం ధర కాస్త తగ్గింది. జపాన్ 929 బిలియన్ డాలర్లు ఉద్దీపన ప్రకటించే అవకాశముంది. ఇందులో ఎక్కువగా కరోనా కారణంగా దెబ్బతిన్న సంస్థలకు ఆర్థిక సాయం ఉండనున్నాయి.

పెరుగుతున్న బంగారం నిల్వలు

పెరుగుతున్న బంగారం నిల్వలు

ఇదిలా ఉండగా ప్రపంచ అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ SPDR గోల్డ్ ట్రస్ట్ హోల్డింగ్స్ వద్ద బంగారం నిల్వలు శుక్రవారం నాటికి 0.4 శాతం పెరిగి 1,116.71 టన్నులకు చేరుకున్నాయి. ఇతర అతి ఖరీదైన లోహాల ధరల విషయానికి వస్తే పల్లాడియం ఔన్స్‌కు 0.1 శాతం తగ్గి 1,944.06 డాలర్ల వద్ద, ప్లాటినం 1.5 శాతం తగ్గి 827.12 డాలర్ల వద్ద, వెండి 0.6 శాతం తగ్గి 17.08 డాలర్లు పలికింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+