బంగారం, వెండి ధరలు నేడు (మంగళవారం, ఆగస్ట్ 31) పెరిగాయి. గత వారం రోజులుగా ఒత్తిడిలో ఉంది. ఈ ఏడాది చివరలో అమెరికా కేంద్ర బ్యాంకు తన అసెట్ పర్చేజ్‌ను తగ్గించాలని యోచిస్తున్నట్లు అమెరికా ఫెడ్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పోవెల్ సంకేతాలు ఇచ్చారు. ఈ ఏడాదిలోనే నెలవారీ బాండ్స్ కొనుగోలులో కోతలను ప్రారంభించవచ్చునని సంకేతాలిచ్చారు. అయితే సరైన గడువు తేదీ ప్రకటించకపోవడంతో సెప్టెంబర్ నెలలో జరిగే పరపతి విధాన సమావేశంలో స్పష్టత కోసం ఇన్వెస్టర్లు వేచి చూడవచ్చు.
ఈ ప్రభావం పసిడి ధరల పైన ఇటీవల కనిపిస్తోంది. నిన్న క్షీణించాయి. అయితే నేడు రెండు విలువైన లోహాల ధరలు పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో 0.30 శాతం వరకు, వెండి దాదాపు 1 శాతం పెరిగింది. ఇక, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్ ధరలు నాలుగు వారాల గరిష్టానికి చేరుకున్నాయి. నేడు 1820 డాలర్లకు చేరుకుంది.

ధరలు ఎలా ఉన్నాయంటే?
అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు (మంగళవారం) ప్రారంభ సెషన్‌లో రూ.131.00 (0.28%) పెరిగి రూ.47295.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.153.00 (0.32%) పెరిగి రూ.47475.00 వద్ద ట్రేడ్ అయింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో బంగారం ధరలు రూ.9,000 వరకు తక్కువగా ఉన్నాయి.
సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.620.00 (0.98%) పెరిగి రూ.63645.00 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.403.00 (0.63%) ఎగిసి రూ.63990.00 వద్ద ట్రేడ్ అయింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం భారీగా పెరిగింది. ఏకంగా 1820 డాలర్లకు చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ 9.25 (0.51%) డాలర్లు పెరిగి 1,821.45 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇటీవల 1800 డాలర్ల దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్ గతవారం ఈ మార్కును దాటింది.
సిల్వర్ ఫ్యూచర్స్ 24 డాలర్లకు పైనే ఉంది. నేడు 0.249 (1.04%) డాలర్లు క్షీణించి 24.253 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

ధరలు పెరిగితే..
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో అక్టోబర్ ఫ్యూచర్ కీలకస్థాయి రూ.47,500 క్రాస్ చేస్తే రూ.47,800 దిశగా సాగవచ్చునని, రూ.48,000 వద్ద కూడా నిరోధకస్థాయి ఉండవచ్చునని నిపుణులు చెబుతున్నారు. రూ.47,800, రూ.48,000 నిరోధకస్థాయి దాటితే గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,300 స్థాయికి చేరుకోవచ్చునని అంటున్నారు. మరోవైపు రూ.47,500 దిగువనే బంగారం ధరలు కొనసాగితే రూ.47,250 వద్ద మద్దతు ధర, నిరోధకస్థాయి రూ.47,000, రూ.46,750కి చేరుకోవచ్చునని చెబుతున్నారు. సమీప భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేసేవారు ఆచితూచి వ్యవహరించాలి.

ఆచితూచి వ్యవహరించాలి
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిన్న కాస్త క్షీణించినప్పటికీ నేడు 1820 డాలర్ల పైకిచేరుకున్నాయి. నిన్న జెరోమ్ పోవెల్ వ్యాఖ్యలు ధరల పైన ప్రభావం చూపాయి. వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. బంగారం ధరలు తిరిగి పుంజుకుంటున్న సమయంలో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరించాలని నిపుణుల సూచన.
More From GoodReturns

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Silver: వెండి ధర కిలో రూ.2 లక్షల కంటే కిందకు పడిపోదా? నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications