కాస్త తగ్గినట్టు అనిపించిన బంగారం మళ్లీ పెరుగుతున్న పరిస్థితి కొనుగోలుదారులను ఆలోచించేలా చేస్తుంది. ఈరోజు 10గ్రాముల ఆర్నమెంట్ బంగారం మీద 150 రూపాయలు, స్వచ్ఛమైన బంగారం మీద 160 రూపాయలు మేర పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది
భారతదేశంలో పెరుగుతున్న బంగారం ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. బంగారం ప్రియులు బంగారాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితికి కారణమవుతున్నాయి. గత కొద్ది కాలంగా బంగారం ధరల దూకుడు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. అంతర్జాతీయంగా బంగారం రేట్లు పడిపోతున్నప్పటికీ, భారతదేశంలో బంగారం ధరలలో హెచ్చుతగ్గులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి
అంతర్జాతీయంగా ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు 1860 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదిలా ఉంటే కాస్త తగ్గినట్టు అనిపించిన బంగారం మళ్లీ పెరుగుతున్న పరిస్థితి కొనుగోలుదారులను ఆలోచించేలా చేస్తుంది. ఈరోజు 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం మీద 150 రూపాయలు, స్వచ్ఛమైన బంగారం మీద 160 రూపాయలు మేర పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57 వేల 710 గా ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,900గా ప్రస్తుతం కొనసాగుతుంది.

విజయవాడ, విశాఖలలో నేడు బంగారం ధరలు
ఇక విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 52,900గా కొనసాగుతుండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,710 గా కొనసాగుతుంది. విశాఖపట్నంలో బంగారం ధర నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 57,710 గా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,900గా కొనసాగుతుంది.

ఢిల్లీ , ముంబై, చెన్నైలో ధరలు ఇలా ..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,860 రూపాయలుగా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో 53,050 గా కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52 వేల 900 రూపాయలుగా కొనసాగుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,710 గా కొనసాగుతుంది. చెన్నైలో బంగారం ధర నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 53,750 గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 58,640 రూపాయలుగా కొనసాగుతుంది.

బంగారం ధరల పెరుగుదలకు అనేక కారణాలు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలలో గణనీయమైన మార్పులు సంభవించాయి. రెండేళ్ల గరిష్టానికి బంగారం ధర చేరుకోవడం ప్రస్తుతం బంగారంపై పెట్టుబడి పెట్టాలా వద్దా అన్న ఆలోచనకు కారణంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు, కేంద్ర బ్యాంకు వద్ద ఉండే బంగారపు నిల్వలు, యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, బంగారం మార్కెట్లో వినియోగదారుల నుండి వస్తున్న డిమాండ్ హెచ్చుతగ్గులు వెరసి బంగారం ధరలపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications