For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9000 తక్కువగా బంగారం ధరలు

|

గోల్డ్ ఫ్యూచర్ ధరలు నేడు (అక్టోబర్ 12, మంగళవారం) దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఉదయం సెషన్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.14.00 (0.03%) లాభపడి 47065.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.81.00 (0.17%) ఎగిసి రూ.47300.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1.45 (+0.08%) డాలర్లు లాభపడి 1,757.15 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో బంగారం ధరలు రూ.47,000 పైన క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ 1755 డాలర్ల పైన ముగిసింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.144.00 (-0.23%) లాభపడి రూ.61600.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.124.00 (-0.20%) ఎగిసి రూ.62108.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.078 (-0.34%) క్షీణించి 22.587 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.9,100 తక్కువగా ఉంది. గత ఏడాది (2020) ఆగస్ట్ 7వ తేదీన గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ 2072 డాలర్లను తాకింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో నాటి నుండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఓ సమయంలో రూ.44,000 దిగువకు పడిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ రూ.50,000కు చేరుకున్నప్పటికీ, సెకండ్ వేవ్ ప్రభావం తర్వాత బంగారం ధరలు క్షీణించాయి. అంతర్జాతీయ పరిణామాలు, కరోనా కేసులు, వ్యాక్సినేషన్ అంశం కరోనా పైన ప్రభావం చూపుతోంది.

Gold price today remains weak, down ₹9,000 from record high

సరఫరా సమస్యల నేపథ్యంలో కొన్ని కమోడిటీస్ ధరలు పెరిగాయి. రిస్క్ సెంటిమెంట్ బలహీనంగా కొనసాగితే, అమెరికా డాలర్ మరింత బలపడితే బంగారం కొంత దిద్దుబాటుకు గురికావొచ్చునని కొటక్ సెక్యూరిటీస్ ఓ నోట్‌లో పేర్కొంది. ఇతర లోహాల విషయానికి వస్తే ప్లాటినమ్ 0.5 శాతం క్షీణించి 1,003.87 డాలర్ల వద్ద పలుకుతోంది.

English summary

ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9000 తక్కువగా బంగారం ధరలు | Gold price today remains weak, down ₹9,000 from record high

Gold and silver prices were muted today in Indian markets today amid subdued global cues. On MCX, gold futures were marginally higher at ₹47,137 per 10 gram while silver futures were flat at ₹61,724 per kg.
Story first published: Tuesday, October 12, 2021, 10:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X