For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price Today: రూ.50,000కు పైనే బంగారం ధర, రూ.60,000 క్రాస్ చేస్తుందా?

|

రెండు రోజుల క్రితం రూ.50,000 దిగువకు వచ్చిన పసిడి ధరలు నిన్న మళ్లీ భారీగా పెరిగాయి. అయితే నేడు స్వల్పంగా తగ్గినప్పటికీ, పది గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50,000కు పైనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రితం సెషన్‌లో 1907 డాలర్ల పైకి చేరుకుంది. నేడు స్వల్పంగా క్షీణించింది. అయితే 1900 డాలర్లకు పైనే కదలాడుతోంది. ఇక సిల్వర్ ఫ్యూచర్ అయితే అంతర్జాతీయ మార్కెట్లో 24 డాలర్లు క్రాస్ చేయగా, దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో రూ.64,000 దాటింది. ఇటీవలి కొద్ది రోజుల్లోనే రూ.2000 వరకు పెరిగింది.

బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

ఎంసీఎక్స్‌లో నేడు ప్రారంభ సెషన్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.153 క్షీణించి రూ.50,175 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.142 తగ్గి రూ.50,350 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 7.75 డాలర్లు క్షీణించి 1900 డాలర్ల వద్ద ఉంది. నేటి సెషన్‌లో 1,899.50 - 1,903.25 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1907 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 4.62 శాతం పెరిగింది. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ద్రవ్యోల్భణ భయాల కారణంగా ధరలు పెరుగుతున్నాయి.

వెండి ధరలు

వెండి ధరలు

వెండి ధరలు నిన్న భారీగా పెరిగినప్పటికీ, నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.125 క్షీణించి రూ.64,220 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.109 తగ్గి రూ.65,080 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.104 డాలర్లు క్షీణించి 24.207 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఏడాదిలో 14 శాతం మేర తగ్గింది. నేటి సెషన్‌లో 24.130 - 24.267 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది.

ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంటుందా?

ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంటుందా?

బంగారం 2020 ఆగస్ట్ నెలలో ఎంసీఎక్స్‌లో ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200, అంతర్జాతీయ మార్కెట్‌లో 2075 డాలర్లను తాకింది. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితి ఇలాగే కొనసాగితే ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. అయితే అమెరికా వంటి దేశాల జోక్యం కారణంగా పరిస్థితులు చల్లబడే అవకాశాలు కొట్టి పారేయలేమని, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య పరిస్థితి పసిడి మార్కెట్ పైన ఉంటుందని చెబుతున్నారు. గత మూడు వారాల్లో పసిడి 6.55 శాతం ఎగబాకింది. పరిస్థితిని బట్టి మరో 9 శాతం మేర పెరిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

సమీప కాలంలో అయితే బంగారం 1900 డాలర్లకు కాస్త అటు ఇటుగా కదలాడవచ్చునని చెబుతున్నారు. మద్దతు ధర 1890 డాలర్ల నుండి 1900 డాలర్లు. ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర 50,200కు పైనే కనిపించే అవకాశాలున్నాయి. మద్దతు ధర రూ.50,150 నుండి రూ.49,950.

పసిడి వచ్చే మూడు నాలుగు నెలల్లో మాత్రం రూ.52,000కు చేరుకుంటుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.

English summary

Gold Price Today: రూ.50,000కు పైనే బంగారం ధర, రూ.60,000 క్రాస్ చేస్తుందా? | Gold Price Today Remains Over Rs 50,000 mark, Will it Rise Further to All Time High?

Gold price in India continued to remain over Rs 50,000-mark on Wednesday. The ongoing conflict between Russia and Ukraine had pushed the yellow metal price to its highest level in a year.
Story first published: Wednesday, February 23, 2022, 12:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X