ముంబై: అగ్రరాజ్యం అమెరికాలో ద్రవ్యోల్బణం అమాంతం పెరిగింది. అమెరికన్ ఇన్‌ఫ్లేషన్ గరిష్ఠస్థాయికి చేరుకోవడం 41 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. దీని ప్రభావం బులియన్ మార్కెట్‌పై పడింది. బంగారం, వెండి ధరలు పైపైకి ఎగబాకడం మొదలు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్‌లో 22.40 డాలర్ల పెరుగుదల కనిపించింది. ఔన్స్ ఒక్కింటికి 1875.20 డాలర్లకు చేరింది.
డొమెస్టిక్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధరలో పెరుగుదల చోటు చేసుకుంది. 689 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 51,694 రూపాయలు పలుకుతోంది. కిందటివారం మొత్తం బంగారం ధరల్లో తగ్గుదల ఉన్నప్పటికీ.. అమెరికా ద్రవ్యోల్బణం ప్రభావాన్ని చూపింది.

మే నెలలో 41 శాతానికి పెరిగినట్లు అధికారిక లెక్కలు వెలువడిన వెంటనే స్పాట్ గోల్డ్ ధరలో పెరుగుదల నెలకొంది. ఒక్కో ఔన్స్ ధర 1,865 డాలర్ల నుంచి 1,875 డాలర్లకు చేరింది. ఇది మరింత పెరుగుతుందని, 1,900 డాలర్లకు చేరుతుందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. ఔన్స్ ధర గరిష్ఠ స్థాయిలో 1,900 డాలర్లను దాటుతుందనే అంచనాలు లేకపోలేదు.
డాలర్ మరింత బలహీనపడటం, క్రూడాయిల్ ధర 120 డాలర్లకు పైగా స్థిరంగా కొనసాగుతుండటం వంటి కారణాలతో బంగారం ధర మరింత పెరగొచ్చని ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ కమోడిటీ ఎక్స్‌పర్ట్ అనూజ్ గుప్తా చెప్పారు. మున్ముందు డొమెస్టిక్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర మరింత పెరగొచ్చని అంచనా వేశారు.
22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.48,350గా ఉండగా.. 24 క్యారట్ల ధర 52,750 రూపాయలు. చెన్నైలో 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర 48,420 రూపాయలు కాగా 24 క్యారట్లు 52,820 రూపాయలకు చేరింది. పుణెలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52,800 రూపాయలు, అహ్మదాబాద్‌లో 52,780 రూపాయలు, జైపూర్‌లో 52,900 రూపాయలు, పాట్నాలో 52,800 రూపాయలు, భువనేశ్వర్‌లో 52,750 రూపాయలుగా నమోదైంది.
అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47,800 రూపాయలు, బెంగళూరులో 47,750 రూపాయలు, భువనేశ్వర్‌లో 47,750 రూపాయలు, చండీగఢ్‌లో 47,900 రూపాయలు, కోయంబత్తూర్‌లో 47,850 రూపాయలు, ఢిల్లీలో 47,750, తిరువనంతపురంలో 47,750 రూపాయలుగా నమోదైంది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!



Click it and Unblock the Notifications