పసిడి మళ్లీ పరుగులు పెడుతుందా..పడుతుందా?: బంగారం కొనడానికి ఇది సరైన సమయమేనా?
ముంబై: అంతర్జాతీయంగా చోటు చేసుకుంటోన్న పరిణామాలు.. దేశీయ బులియన్ మార్కెట్‌పై ఎప్పటికప్పుడు ప్రభావాన్ని చూపుతుంటాయి. దాని వల్ల బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటోంటాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం, రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలల తరబడి కొనసాగుతూ వస్తోన్న యుద్ధం వంటి పరిస్థితులు వాటి రేట్లను ప్రభావితం చేస్తోంటాయి. ఈ వారం బులియన్ మార్కెట్ ధరలు ఎలా ఉండొచ్చనే విషయం మీద అంచనాలు ఏర్పడ్డాయి.
ఇవ్వాళ బంగారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. వాటి రేట్లు స్థిరంగా ఉన్నాయి. కిందటివారం పసిడి రేట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గాయి. 1,482 రూపాయల మేర తగ్గుదల కనిపించింది అందులో. ఈ స్థాయిలో ధరలు తగ్గడం వల్ల పలు నగరాల్లో కొనుగోళ్లు పెరిగాయి. హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల బులియన్ మార్కెట్లల్లో భారీ ఎత్తున బంగారం కొనుగోళ్లు చోటు చేసుకున్నాయి.

ఈ వారం ప్రారంభంలో మాత్రం రేట్లల్లో కదలిక కనిపించలేదు. 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.47,650గా ఉండగా.. 24 క్యారట్ల ధర 51,980 రూపాయలు. చెన్నైలో 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర 46,890 రూపాయలు కాగా 24 క్యారెట్లు 51,150 రూపాయలకు చేరింది. పుణెలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,240, అహ్మదాబాద్‌లో 51,260, జైపూర్‌లో 51,360 రూపాయలుగా నమోదైంది.
పాట్నాలో 24 క్యారెట్ల బంగారం ధర 51,240, వడోదరలో 51,240, లక్నోలో 51,360, కోయంబత్తూరులో 51,150, మధురై-51,150, విజయవాడ- 51,210, విశాఖపట్నం-51,250, నాగ్‌పూర్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,240 రూపాయలుగా పలుకుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,250, కోల్‌కత- 51,210, ఢిల్లీ- 51,210, తిరువనంతపురంలో 51,210 రూపాయలుగా నమోదైంది.


Click it and Unblock the Notifications