బంగారం ధరలు నేడు (జూన్ 1) స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో ప్రారంభంలో కాస్త సానుకూలగా కనిపించినప్పటికీ ఆ తర్వాత క్షీణించాయి. ఓ సమయంలో రూ.49,000 క్రాస్ చేసి రూ.50వేల దిశగా వెళ్తున్నట్లు కనిపించింది. అయితే నేడు తిరిగి రూ.49వేల దిగువకు పడిపోయింది. బంగారం ధరలు క్షీణించగా, వెండి ధరలు మాత్రం పెరిగాయి. రూ.72,200 పైకి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లోను 28 డాలర్ల పైనే కదలాడుతోంది.

పసిడి డౌన్
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.111.00 (0.23%) తగ్గి రూ.48710.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,049.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,225.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,710.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు స్థిరంగా ఉంది. రూ.4.00 (0.01%) పెరిగి రూ.49353.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,461.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,721.00 గరిష్టాన్ని, రూ.49,180.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.72వేలు దాటిన వెండి
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.705.00 (0.98%) పెరిగినప్పటికీ ఆ తర్వాత కాస్త తగ్గింది. అయినప్పటికీ పెరుగుదలతోనే ఉంది. సాయంత్రానికి రూ.362.00 (0.50%) పెరిగి రూ.72260.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,500.00 వద్ద ప్రారంభమై, రూ.72,582.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.72,102.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.349.00 (0.48%) పెరిగి రూ.73450.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.73,786.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.74,635.00 గరిష్టాన్ని, రూ.73,300.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు తగ్గాయి. ప్రారంభంలో 1915 డాలర్లకు చేరుకున్నప్పటికీ ఆ తర్వాత 1900 డాలర్ల స్థాయికి దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 3.75
(0.20%) డాలర్లు పెరిగి 1,901.55 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,894.50 - 1,919.10 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ పెరిగింది. 0.073 (+0.26%) డాలర్లు పెరిగి 28.087 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 28.032 - 28.698 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications