Gold Price Today: బంగారం ధరలు పెరిగి, తగ్గాయి
బడ్జెట్‌కు ముందు రోజు, బడ్జెట్ నాడు పెరిగిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో నేడు ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.115.00 తగ్గి రూ.47,850 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.66.00 క్షీణించి రూ.47,846 వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000ను సమీపించింది. నిన్న రూ.300కు పైగా పెరిగింది. నేడు ప్రారంభ సెషన్‌లో మాత్రం కాస్త తగ్గింది. ఈ వారం గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,600కు పైన ప్రారంభించింది. రెండు రోజుల్లో రూ.300కు పైగా పెరిగి, నేడు రూ.100 మాత్రమే తగ్గింది.
సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం పెరుగుతోంది. నేటి ప్రారంభ సెషన్లో మార్చి సిల్వర్ ఫ్యూచర్ రూ.122.00 (0.20%) పెరిగి రూ.61480.00 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.102.00 (0.16%) పెరిగి రూ.62250.00 వద్ద ట్రేడ్ అయింది. గతవారం ఓ సమయంలో రూ.66,000ను సమీపించిన సిల్వర్ ఫ్యూచర్స్, అదే సమయంలో రూ.61,000 దిగువకు కూడా పడిపోయింది. ఇప్పుడు మళ్లీ రూ.61,500ను సమీపించింది.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ క్షీణించింది. 1800 డాలర్లకు దిగువనే ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో 2.85 డాలర్లు తగ్గి 1798.65 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం పెరిగింది. నేటి సెషన్‌లో 0.062 డాలర్లు పెరిగి 22.657 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications