Gold Price Today : పెరిగిన బంగారం ధర, ఏకంగా రూ.2,400 పెరిగిన వెండి
ముంబై: బంగారం ధరలు నేడు(జనవరి 28) స్వల్పంగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతున్న పసిడి ధరలు ఈరోజు ప్రారంభ సెషన్లోను తక్కువగానే ఉన్నాయి. అయితే ఆ తర్వాత స్వల్పంగా పెరిగాయి. నిన్న 10 గ్రాముల పసిడి రూ.49,000 దిగువకు చేరుకున్నప్పటికీ, నేడు ఈ మార్కును క్రాస్ చేసింది. అయినప్పటికీ రూ.50,000కు దిగువనే ఉంది. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు యాభై వేల రూపాయల వద్దే కదలాడుతోంది. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో ఇప్పటికీ రూ.7100కు పైగా తక్కువగా ఉంది.

49,000 పైకి పసిడి
నేడు సాయంత్రం సెషన్‌లో ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 216.00 (-0.44%) పెరిగి రూ.49,081.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,700.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,272.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,642.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7100కు పైగా తక్కువ ఉంది.ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 254.00 (-0.52%) పెరిగి రూ.49,370.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,980.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,555.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,900.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.2400 జంప్
సిల్వర్ ఫ్యూచర్స్ భారీగా పెరిగింది. కిలో మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ 2,364.00 (3.55%) పెరిగి రూ.68900.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,000.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,527.00 వద్దనే గరిష్టాన్ని, రూ.65,501.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. రూ.-2,202.00 (-3.27%) పెరిగి రూ.69870.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,870.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,264.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,500.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
సిల్వర్ ఫ్యూచర్స్ చాలా రోజులకు 70వేల మార్కును దాటింది.

1860 డాలర్ల పైకి పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1860 డాలర్ల పైకి చేరింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ +14.40 (+0.78%) డాలర్లు పెరిగి 1,863.30 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,835.60 - 1,865.70 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 14.95% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర +1.381 (+5.44%) డాలర్లు తగ్గి 26.770 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.895 - 27.067 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 42.58శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications