బంగారం, వెండి ధరలు క్రమంగా పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ఎనిమిది రోజులుగా తగ్గుతున్న ధరలు బంగారం ప్రియులకు ఊరటనిస్తున్నాయి. నేడు ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
బంగారం, వెండి ధరలు క్రమంగా పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ఎనిమిది రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు బంగారం ప్రియులకు ఊరటనిస్తున్నాయి. ఈ సంవత్సరం తొలి నుండి విపరీతంగా పెరిగిన బంగారం ధరలు ప్రస్తుతం క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో బాగా పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం పడిపోతున్న పరిస్థితి బంగారం ఇన్వెస్టర్లను ఆలోచించేలా చేస్తుంది.

తగ్గుతున్న బంగారం ధరలు
జాతీయంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో, దేశీయంగాను బంగారం ధరల తగ్గుదల ప్రధానంగా కనిపిస్తుంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు ప్రస్తుతం 1843.60 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, స్పాట్ సిల్వర్ రేటు 21.81 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక అంతర్జాతీయంగా గోల్డ్ ధరల తగ్గుదల ప్రభావం దేశీయంగానూ కనిపిస్తుంది. ఇక దేశంలో నేడు బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే వంద రూపాయల మేర తగ్గినట్టు తెలుస్తుంది.

హైదరాబాద్ లో నేడు బంగారం ధరలు ఇలా
హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 52,000 వద్ద కొనసాగుతుంది. ఈ ధర నిన్న 52,100గా ఉంది. ప్రస్తుతం వంద రూపాయలు మేర 22 క్యారెట్ల బంగారం మీద ధర తగ్గినట్టు తెలుస్తుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు హైదరాబాదులో 56,730 రూపాయలుగా కొనసాగుతుంది. నిన్నటి ధరతో పోలిస్తే 100 రూపాయల మేర 24 క్యారెట్ల బంగారం ధర తగ్గింది.

ఢిల్లీ, ముంబైలలో బంగారం ధరలు నేడు
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 52,150 రూపాయలుగా కొనసాగుతుండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,880 గా కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి నేడు 52,000గా కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 56,730 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.

ఏపీలో బంగారం ధరలు ఇలా.. చెన్నైలోనే అత్యధికంగా బంగారం ధరలు
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,000గా కొనసాగుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,730 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. విజయవాడలోని ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఒక దేశంలోనే అత్యధికంగా బంగారం ధరలు ఉండే తమిళనాడు రాష్ట్రంలో బంగారం ధరల విషయానికి వస్తే చెన్నై, మధురై, కోయంబత్తూర్ లలో బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 52,700గా ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 57,500గా విక్రయించబడుతుంది.

బంగారం కొనటానికి ఇదే సరైన సమయం అంటున్న నిపుణులు
అయితే స్థానికంగా ఉండే పన్నులను బట్టి బంగారం ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన అంశం. రానున్న రోజుల్లో మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని, కొనుగోలుదారులకు ఇది మంచి సమయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం మీద పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది సరైన సమయం అని సూచిస్తున్నారు. కొద్దిరోజుల కిందట రికార్డులు బ్రేక్ చేసి పెరిగిన బంగారం ధర ఇప్పుడిప్పుడే మళ్ళీ తగ్గుతున్న నేపథ్యంలో బంగారం కొనాలనుకునేవారు ఇప్పుడు నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications