బంగారం ధరల దూకుడుకు కళ్ళెం.. పసిడి ప్రియులకు సంబరం: కొనటానికి ఇది సమయమేనా?
ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచి విపరీతంగా పెరిగిన బంగారం ధరలు గత వారం రోజులుగా తగ్గుతున్న పరిస్థితులు కొనుగోలుదారులకు కాస్త ఉరట ఇస్తున్నాయి. నేడు బంగారం ధరలిలా ఉన్నాయి.
బంగారం వెండి ధరలలో ప్రతిరోజు ఏదో ఒక మార్పు చోటు చేసుకుంటుంది. ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచి విపరీతంగా పెరిగిన బంగారం ధరలు గత వారం రోజులుగా తగ్గుతున్న పరిస్థితులు కొనుగోలుదారులకు కాస్త ఉరట ఇస్తున్నాయి. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న, బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులు ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయమా? కాదా అన్నది ఆలోచిస్తున్నారు. ఇంకా బంగారం ధరలు తగ్గితే బాగుండు అని సామాన్య, మధ్యతరగతి ప్రజలు వేచి చూస్తున్నారు.

ఢిల్లీ, హైదరాబాద్ లలో బంగారం ధరలు ఇలా
ఈరోజు దేశంలో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,100గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,830 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరల విషయానికొస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,250 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57 వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,830 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది.

ముంబై, విజయవాడ, విశాఖలలో నేడు బంగారం ధరలు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,100 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,830 రూపాయల వద్ద విక్రయించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,100 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,830 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక విశాఖపట్నంలోని ఇవే ధరలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

చెన్నైతో పాటు తమిళనాడులోని ప్రధాన నగరాల్లో ధరలిలా
ఇక దేశంలోనే అత్యధికంగా బంగారం ధరలు ఉండే తమిళనాడు రాష్ట్రంలో చెన్నై , మధురై, తిరునవ్వేలి, తిరుపూర్ తిరుచ్చి, సేలం, వేల్లూరు, ఈ రోడ్, కోయంబత్తూర్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52 వేల 800 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,600 రూపాయలుగా విక్రయించబడుతుంది. గత వారం రోజులుగా బంగారం ధరలు తగ్గడంతో బంగారం కొనుగోలుదారులు ఇప్పుడిప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముందు ముందు ధరల పతనం మరింత కొనసాగుతుందా? లేదా అనేది? తెలియాల్సి ఉంది. ఏదిఏమైనప్పటికీ తులం 62000 వరకు చేరుకుంటుందనుకున్న బంగారం ధరలకు బ్రేక్ పడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్ అని చెప్పాలి.


Click it and Unblock the Notifications