Gold price today: పసిడి ప్రియులకు శుభవార్త: రికార్డుస్థాయిలో బంగారం ధరల పతనం; ధరలిలా!!
గత మూడు రోజులుగా చూసినట్లయితే బంగారం ధరలలో వరుసగా తగ్గుదల కనిపిస్తుంది. ఇక ఈ పరిణామం బంగారం కొనుగోలుదారులకు ఊరటనిస్తుంది.
బంగారం ధరలు భారీగా తగ్గుతున్న పరిస్థితి ప్రస్తుతం గోల్డ్ లవర్స్ కు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి విపరీతంగా పెరిగిన బంగారం ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేనంతగా కొండెక్కి కూర్చున్నాయి. ధరాఘాతంతో చాలా మంది బంగారం షాపుల వైపు చూడాలి అంటేనే భయపడ్డారు. ఇక ధరలు తగ్గవు అని పసిడి ప్రియులు నిరాశ నిస్పృహలతో ఉన్న సమయంలో ఇప్పుడిప్పుడే బంగారం ధరలు కిందికి దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

బంగారం ధరలలో రికార్డు పతనం.. పసిడి ప్రియులకు ఊరట
గత మూడు రోజులుగా చూసినట్లయితే బంగారం ధరలలో వరుసగా తగ్గుదల కనిపిస్తుంది. ఇక ఈ పరిణామం బంగారం కొనుగోలుదారులకు ఊరటనిస్తుంది. ఇదిలా ఉంటే నేడు తులం బంగారం పై ఏకంగా 430 రూపాయలు తగ్గడం ప్రధానంగా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో తగ్గుదల ఇదే మొదటిసారిగా కనిపిస్తుంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలలోనూ బంగారం ధరలలో తగ్గుదల నమోదయింది. ఇక ఈరోజు వివిధ ప్రధాన నగరాల్లో ట్రేడ్ అవుతున్న బంగారం ధరల విషయానికి వస్తే..

హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలలో ధరలు ఇలా
హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర తాజాగా 51,800 గా కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,510 గా ట్రేడ్ అవుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,950గా కొనసాగుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,660 గా కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,800గా ట్రేడ్ అవుతుండగా 24 క్యారెట్ల బంగారం ధర 56,510 గా ట్రేడ్ అవుతుంది.

విశాఖ, విజయవాడలతో పాటు చెన్నైలో బంగారం ధరలిలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51800గా ట్రేడ్ అవుతుండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,510 గా ఉంది. ఇక విశాఖపట్నంలోనూ 51 వేల 800 రూపాయలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉండగా 56,510 రూపాయలు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కొనసాగుతుంది. ఇక దేశంలోనే అత్యధికంగా బంగారం ధరలు ఉండే చెన్నై, కోయంబత్తూర్, మధురై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,500 కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,230 రూపాయలుగా ఉంది.

బంగారం ధరల తగ్గుదలపై సామాన్యుల ఆశలు
60 వేల రూపాయలకు చేరుకుంటుందని అందరూ భావించిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పెట్టడం బిగ్ రిలీఫ్ గా కనిపిస్తుంది. ఈ ధరల తగ్గుదల మరింత కొనసాగాలని సామాన్య మధ్య తరగతి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ ప్రతికూల ఫలితాల ప్రభావంతో పెరిగిన బంగారం ధరలు, ప్రస్తుత అంతర్జాతీయంగా కాస్త పరిస్థితులలో మార్పు, మిశ్రమ ఫలితాలు నమోదు అవుతున్న నేపథ్యంలో మారుతూ వస్తున్నాయి.

తగ్గుతున్న వెండి ధరలు
ఇదిలా ఉంటే వెండి ధరల్లోను గణనీయమైన తగ్గుదల కనిపిస్తుంది .దేశంలోనే అన్ని ప్రధాన నగరాలలోనూ ఈరోజు వెండి ధరలు గండనీయంగా తగ్గాయి. ఈరోజు కిలో వెండి ధర హైదరాబాద్ లో 71,800గా ఉండగా విజయవాడ విశాఖపట్నంలో కూడా 71,800 కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 69 వేల రూపాయలు కాగా, ముంబైలో కూడా 69 వేల రూపాయలే కొనసాగుతుంది.


Click it and Unblock the Notifications