Gold price today: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్: బంగారం ధరల తగ్గుముఖం.. లేటెస్ట్ ధరలివే!!
క్రమంగా పెరుగుతూ పోతున్న బంగారం ధరల్లో తగ్గుదల నమోదు కావడం కాస్త ఉపశమనం కలిగిస్తున్న అంశం. ఈరోజు దేశంలో తగ్గిన బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
గత కొంతకాలంగా ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలు అప్పుడప్పుడు తగు ముఖం పడుతున్న పరిస్థితులు తెలిసిందే. ఇక తాజాగా మరోమారు బంగారం ధరలలో భారీ తగ్గుదల కనిపించింది. చుక్కలను తాకిన బంగారం ధరలు సామాన్య మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేనంతగా పెరిగిపోయిన వేళ, బంగారం ధరలు తగుముఖం పట్టేది ఎప్పుడెప్పుడా అని నిరీక్షిస్తున్న వారికి బంగారం ధరల తగ్గుదల ఇప్పుడు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

హైదరాబాద్ లో నేడు బంగారం ధరలు ఇలా
తులం బంగారం ధర 60 వేల రూపాయలకు చేరుతుందని నిపుణులు అంచనా వేసిన నేపథ్యంలో క్రమంగా పెరుగుతూ పోతున్న బంగారం ధరల్లో అప్పుడప్పుడు తగ్గుదల నమోదు కావడం కాస్త ఉపశమనం కలిగిస్తున్న అంశం. ఇక తాజాగా దేశంలోని వివిధ ముఖ్య నగరాలలో బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు 57,230 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,500 రూపాయలుగా కొనసాగుతుంది. నిన్న ఈ ధరలు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 52,600 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 57,380గా నమోదైంది. నిన్నటి కంటే 22 క్యారెట్ల బంగారం మీద వంద రూపాయలు, 24 క్యారెట్ల బంగారం మీద 150 రూపాయల మేర ధర తగ్గింది.

విజయవాడ, విశాఖ, చెన్నైలలో బంగారం నేటి ధరలిలా
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,230 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,500 రూపాయలుగా కొనసాగుతుంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,230 రూపాయలుగా ఉంటే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,500గా ప్రస్తుతం కొనసాగుతుంది. నిన్న విజయవాడ, విశాఖపట్నంలలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 52,600 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 57,380గా నమోదైంది. ఇక చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 58,200గా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53,350 గా కొనసాగుతుంది. చెన్నైలో మాత్రమే కాకుండా కోయంబత్తూరులోనూ, మధురై లోను ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా తమిళనాడులోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఉంటాయి.

ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో నేడు బంగారం ధరలివే
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేడు 57,380 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంటే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో 52,650 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,230 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంటే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,500గా ట్రేడ్ అవుతుంది. ఇక బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,280గా ప్రస్తుతం కొనసాగుతుంటే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,550 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Click it and Unblock the Notifications