ముంబై: బంగారం ధరలు ఈ వారం పైకి కిందకు కదులుతున్నాయి. మొదటి రెండు సెషన్లలో రూ.1500 వరకు పెరిగిన బంగారం ధరలు, నిన్న రూ.1200కు పైగా తగ్గాయి. మళ్లీ అంతలోనే నేడు (గురువారం, జనవరి 7) మళ్లీ పెరిగాయి. నిన్న ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1,230.00 (-2.38%) క్షీణించి రూ.50490.00 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.70వేల దిగువకు వచ్చింది. కిలో రూ.1,668.00 (-2.35%) క్షీణించి రూ.69190.00 వద్ద ముగిసింది. నేడు బంగారం సాయంత్రం సెషన్ సమయానికి రూ.400 వరకు పెరిగింది. ఓ సమయంలో రూ.51,000 మార్కును దాటింది.

బంగారం ధరలు జంప్
నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 371.00 (0.73%) పెరిగి రూ.50880.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,740.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.51,046.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,660.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.5300 తక్కువగా ఉంది.ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.296.00 (0.59%) పెరిగి రూ.50850.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,797.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.51,069.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,750.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.500 జంప్
సిల్వర్ ఫ్యూచర్స్ రూ.500 వరకు పెరిగింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 488.00 (0.70%) పెరిగి రూ.69905.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,585.00 వద్ద ప్రారంభమై, రూ.70,291.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,405.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.565.00 (0.80%) పెరిగి రూ.70900.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,650.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,200.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,483.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో ఎంత అంటే
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్స్ 1950 డాలర్ల దిగువకు వచ్చింది. అయినప్పటికీ 1900 డాలర్ల పైనే ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 7.50(+0.39%) డాలర్లు పెరిగి 1,916.10 డాలర్లు పలికింది. నేటి సెషన్లో 1,907.65 - 1,929.50 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 20% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.253
(+0.94%) డాలర్లు తగ్గి 27.295 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.023 - 27.488 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 46.36 శాతం పెరిగింది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications