ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు బుధవారం దేశీయ మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి.
భారతదేశంలో బంగారం ధరలు పెరుగుతున్న పరిస్థితి బంగారం ప్రియులకు ఆవేదన కలిగిస్తుంది. పేద, మధ్యతరగతి ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో కనిపిస్తుంది. భారతదేశంలో శుభ సందర్భం ఏదైనా సరే బంగారాన్ని కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఇక అటువంటి ఆనవాయితీని కొనసాగించడం పెరుగుతున్న ధరలతో ముందు ముందు కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెరగడంతో బంగారం ధరలు క్షీణిస్తాయని భావించినప్పటికీ, రెండు రోజులపాటు తగ్గిన బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.

దేశీయంగా పెరుగుతున్న బంగారం ధరలు
ఇప్పటికే రెండేళ్ల గరిష్టాన్ని దాటి ట్రేడ్ అవుతున్న బంగారం ధరలు, తగ్గుతాయని అందరూ భావిస్తే.. మళ్లీ పెరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం భారతదేశంలో కనిపిస్తుంది. అంతర్జాతీయంగా ధరలు కాస్త తగ్గుతున్నప్పటికీ దేశీయంగా మళ్ళీ ధరలు పెరగడం ప్రధానంగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు బుధవారం దేశీయ మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి.

నేడు హైదరాబాద్, విజయవాడలలో బంగారం ధరలు ఎంతంటే
ప్రస్తుతం హైదరాబాద్లో బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 52,750 గా కొనసాగుతుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేడు హైదరాబాద్ మార్కెట్లో 57,550 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక విజయవాడలో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర విజయవాడలో ఈరోజు 52,750 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 57,550 వద్ద మార్కెట్లో కొనసాగుతోంది.

ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో బంగారం ధరలు ఇలా
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 52,900 వద్ద ట్రేడ్ అవుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 57,700 ట్రేడ్ అవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు 52,750 ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 57,550 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బెంగళూరులో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 52,800 కొనసాగుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 57,600 వద్ద ట్రేడ్ అవుతుంది.

చెన్నైలో నేడు బంగారం ధరలు ఎంత ఉన్నాయంటే
ఇక చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 53,830 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం చెన్నైలో నేడు 58,720 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇదిలా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 71 వేల 300 రూపాయలు వద్ద ట్రేడ్ అవుతుండగా, హైదరాబాదులో కిలో వెండి ధర 74 వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. మొత్తంగా చూస్తే బంగారం ధరలు తగ్గుతాయని భావిస్తే, మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్న తీరు ఒకింత షాక్ కు గురిచేస్తుంది.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications