A Oneindia Venture

Gold price today: మళ్ళీ పడిపోయిన బంగారం ధరలు.. తాజాగా గోల్డ్ రేట్స్ ఇవే!!

క్రమంగా రెండో రోజు కూడా బంగారం ధరల్లో తగ్గుదల నమోదు అయ్యింది. ఈరోజు దేశంలో తగ్గిన బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం ధరలు తగ్గుముఖం పడితే బాగుండని ఎదురుచూస్తున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు గత రెండు రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో కాస్త రిలీఫ్ అయ్యారు. బంగారం ధరలు మరింత తగ్గితే బాగుండని వారు భావిస్తున్నారు. ఇప్పటికే బంగారం రెండేళ్ల గరిష్టానికి చేరుకోవడంతో, బంగారం ధరలు దూకుడుకు కళ్లెంపడాలని బంగారం ధరలు దిగువకు రావాలని వారు బలంగా కోరుకుంటున్నారు.

బంగారం ధరల హెచ్చు తగ్గులు.. మార్పులకు కారణం ఇదే

బంగారం ధరల హెచ్చు తగ్గులు.. మార్పులకు కారణం ఇదే

అయితే బంగారం ధరల తగ్గుదల ధరలు పెరిగినంత వేగంగా, ఎక్కువగా లేకపోవడం ఇక్కడ కాస్త నిరాశను కలిగిస్తున్న అంశం. పదిసార్లు బంగారం ధరలు తగ్గినా, రెండుసార్లు బంగారం ధరలు పెరిగాయి అంటే మళ్లీ ధరలు అక్కడికే చేరుకుంటున్నాయి. ఓ సమయములో భారత దేశంలోని చెన్నై, కోయంబత్తూర్, మదురై వంటి చోట్ల 60 వేలకు పైగా చేరుకున్న బంగారం ధర క్రమంగా కాస్త తగుముఖం పట్టడం శుభ పరిణామమే అయినప్పటికీ, ఇక ఇదే ట్రెండ్ కొనసాగుతుందా అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపధ్యంలో బంగారం ధరలలో గణనీయమైన మార్పులు వచ్చాయి.

నేడు స్వల్పంగా తగ్గిన ధరలు.. హైదరాబాద్ లో 100 రూపాయలు తగ్గిన 22 క్యారెట్ల బంగారం ధర

నేడు స్వల్పంగా తగ్గిన ధరలు.. హైదరాబాద్ లో 100 రూపాయలు తగ్గిన 22 క్యారెట్ల బంగారం ధర

ఇక తాజాగా భారతదేశంలో ధరలను గమనిస్తే ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అనేక చోట్ల బంగారం ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు బంగారం ధరల విషయానికి వస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,240 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52 వేల 400 రూపాయలుగా కొనసాగుతుంది. ఈ ధర నిన్న24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 57,230 రూపాయలుగా కాగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 52,500 రూపాయలుగా కొనసాగింది. నిన్నటి కంటే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం మీద వంద రూపాయలు తగ్గినట్టు తెలుస్తుంది. ఇక 24 క్యారెట్ల బంగారం మీద పది రూపాయలు నేడు పెరిగింది.

 ఏపీలోని నగరాలతో పాటు ఢిల్లీ, ముంబై లలో బంగారం ధరలు ఇలా

ఏపీలోని నగరాలతో పాటు ఢిల్లీ, ముంబై లలో బంగారం ధరలు ఇలా

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధరల విషయానికి వస్తే విజయవాడ విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేడు 57,160 రూపాయలుగా ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,400గా కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరల విషయానికొస్తే నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,310 గా ప్రస్తుతం కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,550 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేడు ప్రస్తుతం ఈ సమయానికి 57 వేల 160 రూపాయలుగా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 52,400గా కొనసాగుతుంది.

 చెన్నై, మధురై, కోయంబత్తూర్ లలోనే అధికంగా బంగారం ధరలు

చెన్నై, మధురై, కోయంబత్తూర్ లలోనే అధికంగా బంగారం ధరలు

దేశంలోని ప్రధాన నగరాలలో చెన్నైలో అత్యధికంగా బంగారం ధరలు ఉన్నాయి. చెన్నై, మధురై, కోయంబత్తూర్ లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 58 వేల 140 రూపాయలు కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 53,300గా ఉంది. దేశవ్యాప్తంగా చాలా నగరాలలో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,400గా కొనసాగుతుంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 72, 500 రూపాయలకు చేరుకుంది . ఈరోజు వెండి ధర పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న 72,000 కాగా ఈరోజు 500 రూపాయలు మేర వెండి ధర పెరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+