బంగారం ధరలు మరింత తగ్గాయి, వెండి ధరలు 24 డాలర్ల దిగువకు..
దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా క్షీణించాయి. పసిడి ధరలు ఫ్యూచర్ మార్కెట్లో గత కొద్దివారాలుగా రూ.45,000కు దిగువనే కదలాడుతున్నాయి. ఇటీవలి కాలంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, లాక్ డౌన్ ఉండకపోవచ్చునని ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలు, కేవలం ఆయా ప్రాంతాల్లోనే లాక్‌డౌన్ లేదా ఆంక్షలకు ప్రభుత్వం మొగ్గు చూపడం వంటి వివిధ కారణాలతో బంగారంపై ఒత్తిడి లేకుండా పోయింది. మరోవైపు బిట్ కాయిన్‌ను మరో బంగారంలా చూస్తున్నారు ఇన్వెస్టర్లు. ఇలా వివిధ కారణాలతో పసిడిపై ఒత్తిడి తగ్గి ధరలు పెరగడం లేదు.

తగ్గిన బంగారం
గోల్డ్ ఫ్యూచర్ నేడు (మార్చి 29, 2020) ఉదయం సెషన్‌లో క్షీణించింది. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.45.00 (-0.10%) క్షీణించి రూ.44650.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,635.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,788.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,441.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,600 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50.00 (-0.11%) తగ్గి రూ.45062.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,107.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,231.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,900.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి స్వల్పంగా డౌన్
వెండి ధరలు నేడు రూ.185 తగ్గాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.185.00 (-0.29%) తగ్గి రూ.64684.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.64,975.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.65,244.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,516.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా తగ్గింది. కిలో రూ.235.00 (-0.36%) తగ్గి రూ.65651.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,952.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.65,250.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,600.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు క్షీణించాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 3.55 (-0.20%) డాలర్లు తగ్గి 1,728 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,726.70 - 1,733.95 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల దిగువకు వచ్చింది. ఔన్స్ ధర 0.164 (-0.65%) డాలర్లు తగ్గి 24.950 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.845 - 25.145 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications