రూ.46,700 దిగువకు బంగారం ధరలు, వెడి ధరలు ఎలా ఉన్నాయంటే
బంగారం ధరలు తగ్గుతున్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో పసిడి ధరలు నేడు సాయంత్రం సెషన్‌లో స్వల్పంగా తగ్గాయి. వరుసగా ఏడు రోజుల పాటు ధరలు తగ్గాయి. ఫ్యూచర్ మార్కెట్లో పది గ్రాముల పసిడి రూ.46,700 దిగువకు వచ్చింది. ఇటీవలే రూ.70000 దిశగా పరుగులు పెట్టిన వెండి ఇప్పుడు రూ.67500 దిగువకు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో వెండి ధరలు స్వల్పంగా తగ్గగా, బంగారం ధరలు పెరిగాయి. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.రూ.56200తో రూ.9500 వరకు తక్కువగా ఉంది.

రూ.46,700 దిగువకు పసిడి
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్‌కు స్వల్పంగా తగ్గి రూ.46,700 దిగువకు వచ్చింది. రూ.52.00 (-0.11%) తగ్గి రూ.46674.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,743.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,819.00 గరిష్టాన్ని, రూ.46,605.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.71.00 (-0.15%) తగ్గి రూ.46964.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,000.00 వద్ద ప్రారంభమై, రూ.47,114.00 గరిష్టాన్ని, రూ.46,951.00 కనిష్టాన్ని తాకింది.

వెండి ధర ఎలా ఉందంటే
వెండి ఫ్యూచర్ ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.130.00 (0.19%) పెరిగి రూ.67604.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,395.00 వద్ద ప్రారంభమై, రూ.68,210.00 గరిష్టాన్ని, రూ.67,348.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.226.00 (-0.33%) తగ్గి రూ.68411.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,465.00 ప్రారంభమైన ధర, రూ.69,149.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,339.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. -1.35 (0.08%) డాలర్లు తగ్గి 1,766.95 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,763.40 - 1,773.25 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. 0.153 (0.59%) డాలర్లు తగ్గి 25.900 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.925 - 26.223 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications