బంగారం ధరలు గతవారం రూ.52,000 దిగువన ముగిశాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం పసిడి, స్టాక్ మార్కెట్ పైన కనిపిస్తోంది. దీంతో గతవారం రూ.51,000 స్థాయికి వచ్చిన పసిడి ధరలు ఆ తర్వాత రూ.52,000 క్రాస్ చేశాయి. చివరి సెషన్‌లో దాదాపు రూ.200 క్షీణించి రూ.51,888 వద్ద ముగిశాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 0.36 శాతం లేదా రూ.190 తగ్గి రూ.51,900 దిగువన, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.222 తగ్గి రూ.52,381 వద్ద ముగిశాయి.
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.448 తగ్గి రూ.68,872 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.496 క్షీణించి రూ.69,603 వద్ద ముగిశాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో గోల్డ్ ఫ్యూచర్స్ ఓ సమయంలో రూ.55,000 క్రాస్ చేసి, ఇప్పుడు రూ.52,000 దిగువకు పడిపోయాయి.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1,957.75 డాలర్ల వద్ద ముగిసింది. క్రితం సెషన్‌లో 1962 డాలర్ల వద్ద ముగిసింది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం సమయంలో 2060 డాలర్లు దాటిన గోల్డ్ ఫ్యూచర్స్, ఆ తర్వాత 1920 దిగువకు పడిపోయింది. అయితే గతవారం మాత్రం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25.735 డాలర్ల వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications