Gold prices today: తగ్గుతున్న బంగారం ధరలు, కానీ ఆ మార్క్ పైనే
బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు స్వల్పంగా క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్ నుండి సానుకూలతల నేపథ్యంలో భారత మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఈ ప్రభావం గోల్డ్ ఫ్యూచర్‌పై పడింది. బంగారం రూ.47,400 దిగువన ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.69,000కు సమీపాన ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ 1780 డాలర్లకు దిగువనే ఉంది. వెండి మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పంగా పెరిగింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే బంగారం రూ.8800 తక్కువగా ఉంది.

రూ.47,300కు పసిడి
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో రూ.93.00 (0.90%) తగ్గి రూ.47369.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,465.00 ప్రారంభమైన ధర, రూ.47,515.00 గరిష్టాన్ని, రూ.47,3318.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.137.00 (0.29%) తగ్గి రూ.47,617 వద్ద ట్రేడ్ అయింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,710.00 వద్ద ప్రారంభమై, రూ.47,784.00 గరిష్టాన్ని, రూ.47,617.00 కనిష్టాన్ని తాకింది.

స్వల్పంగా పెరిగిన వెండి
మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.290.00 (0.42%) పెరిగి రూ.68970.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,618.00 వద్ద ప్రారంభమై, రూ.69,197.00 గరిష్టాన్ని, రూ.68,421.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.278.00 (0.40%) తగ్గి రూ.70180.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,976.00 ప్రారంభమైన ధర, రూ.70,416.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,633.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. -1.05 (0.06%) డాలర్లు తగ్గి 1,779.05 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,773.95 - 1,785.70 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగింది. 26 డాలర్లకు పైనే ఉంది. 0.183 (0.70%) డాలర్లు తగ్గి 26.392 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.102 - 26.512 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications