రెండు రోజులుగా షాకిస్తున్న బంగారం ధరలు, మళ్లీ పెరుగుదల
బంగారం ధరలు ఈ రోజు (మే 15) పెరిగాయి. అమెరికా-చైనా సంబంధాలు మరింత దిగజారే పరిస్థితులు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్లో డిమాండ్, అంతర్జాతీయంగా డాలర్ మారకం వ్యాల్యూ ఇలా వివిధ కారణాల వల్ల గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు పెరిగాయి. ఈ ప్రభావం పడి ఎంసీఎక్స్‌లో గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ పెరిగింది. వివిధ దేశాల ఉద్దీపన చర్యల వల్ల బంగారం విస్తృతంగా ప్రయోజనం పొందుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.

స్వల్పంగా పెరిగిన బంగారం ధర
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో బంగారం ధరలు ఉదయం గం.9.20 సమయానికి జూన్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.9 శాతం పెరిగి రూ.46,765 పలికింది. సిల్వర్ ఫ్యూచర్స్ 1.3 శాతం పెరిగి రూ.44,721 పలికింది. బంగారం రూ.46,700కు కాస్త అటు ఇటుగా ఎక్కువ కాలం ఉంటే రూ.47,000 వద్దకు చేరుకుంటుందని చెబుతున్నారు.

మార్కెట్లో పెరిగిన ధరలు
ఇండియాలో బంగారం ధర ఏడాదిలో 40 శాతం వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.350 వరకు పెరిగి రూ.47,750 వరకు పిలకింది. బంగారం ధరల పెరుగుదల ఇది రెండో రోజు. ఢిల్లీలో నిన్న రూ.200 వరకు పెరగగా, ఈ రోజు రూ.250 వరకు పెరిగాయి.

మద్దతు ధర
వారాంతంలో బంగారం వంటి అతి ఖరీదైన లోహాల ధరలు అస్థిరంగా ఉండవచ్చునని చెబుతున్నారు. ట్రాయ్ ఔన్స్ (ఔన్స్‌లా కొలమానం. ఔన్స్ కంటే 2.75 గ్రాములు ఎక్కువ) అంతర్జాతీయ మార్కెట్లో 1,744 వద్ద, ఇండియాలో రూ.46,700 వద్ద ప్రతిఘటన ఎదుర్కోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ స్థాయి దాటితే అంతర్జాతీయ మార్కెట్లో 1,755 డాలర్ల నుండి 1,758 మధ్య (ఇండియన్ కరెన్సీలో రూ.46,920 నుండి రూ.47,000 మధ్య) పెరగవచ్చునని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో 1,733 డాలర్ల నుండి 1,724 డాలర్ల మధ్య (ఇండియా కరెన్సీలో 46,400 నుండి రూ.46,300 మధ్య) మద్దతు ధర పరీక్షను ఎదుర్కొంటుంది.

లాభాల్లో..
గురువారం లోహాలు లాభాల్లో ముగిసి, శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయని, ప్రస్తుత పరిస్థితుల్లో సురక్షి పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారని అర్థమవుతోందని చెబుతున్నారు. కామెక్స్‌లో నిన్న బంగారం 1.4 శాతం లాభపడి 1,743 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. దీర్ఘకాలంలో బంగారం పాజిటివ్‌గానే ఉంటుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications