వరుసగా రెండు రోజుల పాటు పెరిగిన బంగారం ధరలు, నేడు ప్రారంభ సెషన్లో పెరిగినప్పటికీ, సాయంత్రానికి తిరిగి క్షీణించాయి. వెండి ధరలు కూడా రూ.1000కి పైగా క్షీణించి రూ.70వేల దిగువకు వచ్చింది. గతవారం భారీగా తగ్గి 46,000 స్థాయికి వచ్చిన గోల్డ్ ఫ్యూచర్స్ నిన్నటి వరకు వరుస రెండు సెషన్లలో పెరిగింది. ఓ సమయంలో రూ.46వేల దిగువకు చేరుకొని, ఆ తర్వాత 47వేలను క్రాస్ చేసేలా కనిపించింది. అయితే సాయంత్రం సెషన్‌కు క్షీణించింది. నిన్న (సోమవారం) భారీగా పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.703.00, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.699.00 పెరిగింది. నేడు మాత్రం స్వల్పంగా తగ్గాయి.

రూ.47,000 దిగువనే బంగారం
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు ప్రారంభ సెషన్లో స్వల్పంగా పెరిగినప్పటికీ, సాయంత్రం సెషన్‌కు తగ్గింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.141.00 (-0.30%) తగ్గి రూ.46,760.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,973.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,985.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,589.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9,700 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.141.00 (-0.30%) తగ్గి రూ.46,893 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,077.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,100.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,731.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.70వేల దిగువకు వచ్చిన వెండి
వెండి ధరలు కూడా వరుసగా పెరిగి నిన్న రూ.70,500ను క్రాస్ చేసినప్పటికీ, సాయంత్రానికి భారీగా తగ్గి ఈ మార్కు దిగువకు వచ్చాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.1,105.00 (-1.57%) తగ్గి రూ.69,327.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,675.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,699.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,764.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.992.00 (-1.39%) తగ్గి రూ.70586.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,660.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,843.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,066.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఉదయం పెరిగినప్పటికీ, సాయంత్రానికి తగ్గాయి. గోల్డ్ ప్యూచర్స్ డాలర్లు -4.45 (-0.25%) డాలర్లు తగ్గి 1803.95 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,794.65 - 1,815.05 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 8.32 శాతం తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. ఔన్స్ ధర 0.507 (-1.81%) డాలర్లు పెరిగి 27.578 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.300 - 28.422 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Silver: వెండి ధర కిలో రూ.2 లక్షల కంటే కిందకు పడిపోదా? నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications