ముంబై: బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు క్షీణించాయి. నేడు (ఫిబ్రవరి 16, మంగళవారం) ఉదయం సెషన్లో పెరిగినట్లుగా కనిపించిన ధరలు, సాయంత్రం సెషన్‌కు తగ్గుముఖం పట్టాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో(MCX) నిన్న రూ.47,300 దిగువ పలికిన పసిడి నేడు మరింత క్షీణించి రూ.46,700 దిగువకు వచ్చింది. కరోనా నేపథ్యంలో గత ఏడాది ఆగస్ట్ 7న ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 పలికిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు దాదాపు రూ.9100 వరకు తగ్గుదలతో ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా ఉదయం రూ.70,000ను క్రాస్ చేసినప్పటికీ, సాయంత్రానికి ఆ మార్కు దిగువకు వచ్చింది.

స్వల్పంగా తగ్గిన బంగారం
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు ఉదయం అతిస్వల్పంగా పెరిగి, సాయంత్రం సెషన్‌కు తగ్గింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.117.00 (0.25%) తగ్గి రూ.47,124.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,409.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,480.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,682.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9100 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.42.00 (0.09%) తగ్గి రూ.47,340 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,525.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,630.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,850.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

సిల్వర్ రూ.70వేల దిగువకు
వెండి ధరలు ఈ రోజు కూడా ప్రారంభంలో పెరిగినప్పటికీ, సాయంత్రం సెషన్లో తగ్గాయి. ఎంసీఎక్స్‌లో ఉదయం కిలో వెండి రూ.70,000 క్రాస్ చేసింది. సాయంత్రం సమయానికి ఈ మార్కు దిగువకు వచ్చింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.400.00 (0.57%) తగ్గి రూ.69,729.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,510.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,864.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,350.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా కిలో రూ.283.00 (0.40%) తగ్గి రూ.70,948.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,725.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,932.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,527.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1800 డాలర్ల స్థాయికి పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల స్థాయికి వచ్చాయి. నేడు గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 18.65
(1.02%) డాలర్లు తగ్గి 1804.55 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,788.40 - 1,826.85 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 14.83 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం పెరిగింది. ఔన్స్ ధర 0.032
(0.12%) డాలర్లు పెరిగి 27.360 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.880 - 28.065 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 56.67 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications