For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా షాకిచ్చిన పసిడి, రూ.630 పెరిగి రూ.47,000 క్రాస్: వెండి రూ.1100 జంప్

|

బంగారం ధరలు నేడు (ఏప్రిల్ 15, గురువారం) భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పసిడి ఇటీవల పెరుగుతోంది. గత నెలలో ఓ సమయంలో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.43,800 స్థాయికి పడిపోయింది. ఇప్పుడు రూ.47,000 పైన ఉంది. చాన్నాళ్లకు గోల్డ్ ఫ్యూచర్ ఈ మార్కును దాటింది. అంటే ఈ కొద్ది వారాల్లో రూ.3,400కు పైగా పెరిగింది. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.9వేలు మాత్రమే తక్కువగా ఉంది. ఓ సమయంలో రూ.12,400 తక్కువగా ఉంది.

Gold Loans: బంగారం రుణం తీసుకున్నారా, మీపై ప్రభావం ఎలా?Gold Loans: బంగారం రుణం తీసుకున్నారా, మీపై ప్రభావం ఎలా?

బంగారం ధరలు భారీగా జంప్

బంగారం ధరలు భారీగా జంప్

గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు రూ.47వేలకు పైకి చేరుకున్నాయి. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్‌లో రూ.628.00 (1.35%) పెరిగి రూ.47236.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,680.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,279.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,680.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్ రూ.639.00 (1.36%) పెరిగి రూ.47470.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,980.00 ప్రారంభమైన ధర, రూ.47,473.00 గరిష్టాన్ని, రూ.46,960.00 కనిష్టాన్ని తాకింది.

వెయ్యికి పైగా పెరిగిన వెండి

వెయ్యికి పైగా పెరిగిన వెండి

వెండి ధరలు భారీగా పెరిగాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,045.00 (1.54%) పెరిగి రూ.68683.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,708.00 వద్ద ప్రారంభమై, రూ.68,785.00 గరిష్టాన్ని, రూ.67,705.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,130.00 (1.65%) పెరిగి రూ.69767.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,783.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,890.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,770.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1775 డాలర్ల దిశగా...

1775 డాలర్ల దిశగా...

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు భారీగా పెరిగాయి. మళ్లీ 1775 డాలర్ల దిశగా వెళ్తోంది. 32.55 (1.87%) డాలర్లు పెరిగి 1,768.85 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,734.45 - 1,770.35 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.486 (1.90%) డాలర్లు తగ్గి 26.010 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.383 - 26.062 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

భారీగా షాకిచ్చిన పసిడి, రూ.630 పెరిగి రూ.47,000 క్రాస్: వెండి రూ.1100 జంప్ | Gold Price Today: Gold cheaper by Rs 9300, Silver At Rs 68000

Gold and Silver contracts are trading in the green zone in today’s session. On the Multi Commodity Exchange, gold contracts for June delivery are trading Rs 250 per 10 gram higher than yesterday’s trade.
Story first published: Thursday, April 15, 2021, 22:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X