భారీగా పెరిగిన బంగారం ధరలు, వెండి రూ.2,000కు పైగా జంప్
బంగారం, వెండి ధరలు నేడు (మే 6, గురువారం) భారీగా పెరిగాయి. తగ్గినట్లే కనిపించి, అంతలోనే ఎగిసిపడ్డాయి. పది గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,500 దాటి రూ.48,000 దిశగా పరుగులు పెడుతుండగా, వెండి అయితే ఏకంగా రూ.2000కు పైగా పెరిగి రూ.71,000 కూడా దాటేసింది. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు భారీగా ఎగిశాయి. 1800 డాలర్లు దాటి 1820 డాలర్ల దిశగా వెళ్తోంది. సిల్వర్ ఫ్యూచర్స్ 27.500 డాలర్లు క్రాస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం, క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులకు ఆచితూచి వ్యవహరిస్తుండటం పసిడికి కలిసి వచ్చింది. అంతర్జాతీయంగా బంగారం ధరలకు మద్దతు లభించడంతో దేశీయంగా కూడా పెరిగాయని చెబుతున్నారు. దేశీయంగా ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో బంగారంరూ.8700 తక్కువగా ఉంది. గత నెలలో ఓ సమయంలో రూ.12000కు పైగా కూడా తగ్గింది. ఈ కాలంలో పసిడి రూ.3300కు పైగా పెరిగింది.

భారీగా పెరిగిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.567.00 (1.21%) పెరిగి రూ.47567.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,072.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,643.00 గరిష్టాన్ని, రూ.47,000.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.601.00 (1.27%) పెరిగి రూ.47931.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,435.00 వద్ద ప్రారంభమై, రూ.48,000.00 గరిష్టాన్ని, రూ.47,339.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.72వేల దిశగా...
వెండి ఫ్యూచర్ ధరలు నేడు భారీగా పెరిగాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.2,060.00 (2.96%) పెరిగి రూ.71679.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,692.00 వద్ద ప్రారంభమై, రూ.71,944.00 గరిష్టాన్ని, రూ.69,651.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.2,213.00 (3.13%) పెరిగి రూ.72811.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,781.00 ప్రారంభమైన ధర, రూ.72,940.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,738.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు భారీగా పెరిగాయి. 1800 డాలర్లను క్రాస్ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 30.65 (1.72%) డాలర్లు పెరిగి 1,815.20 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,781.90 - 1,818.25 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.988 (3.73%) డాలర్లు పెరిగి 27.508 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.247 - 27.587 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications