గత కొద్ది రోజులుగా బంగారం ధరలు హెచ్చుతగ్గులు చూస్తున్నాయి. కరోనా మహమ్మారి, ప్రపంచవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోవడంతో బంగారం, వెండి, ప్లాటినమ్ వంటి అతి ఖరీదైన లోహాలపై ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఈక్విటీ మార్కెట్లు ఇటీవల కోలుకుంటున్నప్పటికీ ఇన్వెస్టర్లు తక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. చమురు ధరలు దారుణంగా పడిపోయాయి. ఈ సమయంలో అతి ఖరీదైన లోహాల వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు.

అప్పుడే బంగారంపై ఒత్తిడి తగ్గుతుంది
ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారానికి మద్దతు లభిస్తోంది. పసిడి జూన్ ఫ్యూచర్స్ ధర ఔన్స్ 1,650 డాలర్ల వద్దకు, వెండి 14.80 డాలర్లకు చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. ఈక్విటీ మార్కెట్లను గట్టెక్కించేందుకు వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలు ఇన్వెస్టర్లకు ఆశాజనకంగా ఉంటే బంగారంపై ఒత్తిడి తగ్గుతుంది.

రెండు రోజుల్లో రూ.1,000 వరకు తగ్గుదల
బంగారం ధర రెండు రోజులుగా తగ్గుతోంది. హైదరాబాద్ మార్కెట్లో నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.46,200 పలికింది. పసిడి ధర గత రెండు రోజుల్లో రూ.1,000 వరకు తగ్గింది. వెండి ధర కూడా తగ్గింది. ఇది కిలో రూ.41,000 కిందకు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేల తయారీదారుల నుండి డిమాండ్ తగ్గడం ఇందుకు కారణం. అయితే ఇప్పుడు స్వల్పంగా పెరిగింది. నేడు బంగారం ధర రూ.200 వరకు పెరిగింది.

తగ్గిన డిమాండ్.. పెరిగిన ధర
కరోనా మహమ్మారి, ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో గత ఏడాది దేశీయంగా బంగారం డిమాండ్ క్వాంటిటీ పరంగా, వ్యాల్యూ పరంగా తగ్గిన విషయం తెలిసిందే. ప్రపంచంలో రెండో అతిపెద్ద వినియోగదారు ఇండియా. ఇక్కడ 41 శాతం డిమాండ్ పడిపోయి 73.9 టన్నులకు చేరుకుంది. క్వార్టర్ పరంగా ధరలు 25 శాతం పెరిగాయి.


Click it and Unblock the Notifications