బంగారం ధరలు పెరిగాయి, ఎంసీఎక్స్‌లో రూ.49,000కు పైనే...
బంగారం ధరలు నేడు (బుధవారం, జూన్ 2) పెరిగాయి. నిన్న రూ.49,000కు కాస్త దిగువన ముగిసిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఈ మార్కును దాటింది. వెండి మాత్రం రూ.200 వరకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 1900 డాలర్ల దిగువకు వచ్చినప్పటికీ, సమీపంలోనే కదలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ వారం బంగారం మద్దతు ధర 1,894-1,884 డాలర్లు, నిరోధకస్థాయి 1,914-1,933. వెండి మద్దతు ధర 27.88-27.55 డాలర్లు, నిరోధకస్థాయి 28.40-28.70. ఎంసీఎక్స్‌లో బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.7000 తక్కువగా ఉంది.

పెరిగిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.145.00 (0.30%) పెరిగి రూ.49140.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,100.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,140.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.49,100.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.98.00 (0.20%) పెరిగి రూ.49523.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,311.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,575.00 గరిష్టాన్ని, రూ.49,301.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

తగ్గిన రూ.72వేలకు పైనే వెండి
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.198.00 (-0.27%) తగ్గి రూ.72050.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,000.00 వద్ద ప్రారంభమై, రూ.72,189.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.71,698.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.93.00 (-0.13%) తగ్గి రూ.73320.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.73,160.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.73,349.00 గరిష్టాన్ని, రూ.72,922.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు తగ్గాయి. 1900 డాలర్ల దిగువకు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 5.85
(0.31%) డాలర్లు తగ్గి 1,899.15 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,897.15 - 1,904.75 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. 0.300 (1.07%) డాలర్లు పెరిగి 27.802 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.817 - 28.055 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications