4 రోజుల్లో మూడుసార్లు తగ్గిన బంగారం ధరలు, ఎంత ఉన్నాయంటే?
బంగారం ధరలు క్షీణిస్తున్నాయి. దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లలో ధరలు గత కొద్ది సెషన్లుగా పడిపోతున్నాయి. ఎంసీఎక్స్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,000 దిగువనే ట్రేడ్ అవుతోంది. మంగళవారం (14, సెప్టెంబర్) ప్రారంభ సెషన్‌లో రూ.46,900 దిగువకు కూడా క్షీణించింది. అయితే నేటి ప్రారంభ సెషన్‌లో అతి స్వల్ప తగ్గుదల లేదా స్థిరంగా కనిపించింది. MCXలో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.27.00 (-0.06%) క్షీణించి రూ.46,881 వద్ద, డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.13.00 (-0.03%) క్షీణించి రూ.47080.00 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.63,000 స్థాయిలో ఉంది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.159.00 (-0.25%) తగ్గి రూ.63140.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.100.00 (-0.16%) క్షీణించి రూ.64034.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల దిగువనే ఉంది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో 2.15 (-0.12%) డాలర్లు క్షీణించి 1,792.25 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.116 (-0.49%) డాలర్లు తగ్గి 23.680 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత నాలుగు సెషన్‌లలో గోల్డ్ ఫ్యూచర్స్ మూడుసార్లు తగ్గింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.9400 వరకు తక్కువగా ఉంది.

ఆ డేటా వైపు ఆసక్తి
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ వ్యాల్యూ రెండు వారాల గరిష్టం వద్ద దాదాపు స్థిరంగా ఉంది. డాలర్ వ్యాల్యూ సానుకూలంగా ఉండటంతో గోల్డ్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. అదే సమయంలో అమెరికా ద్రవ్యోల్భణం డేటా విడుదల కానుంది. ఈ డేటా వైపు అందరు ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే గతవారం విడుదలైన జాబ్ డేటా ప్రభావం బంగారంపై కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.1 శాతం తగ్గి 1791.16 డాలర్లకు పడిపోయింది.1770 డాలర్ల మద్దతు ధర కనిపిస్తోందని, అదే కొనసాగితే రికవరీకి అవకాశాలు లేకపోలేదని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ స్థాయి కంటే దిగువకు పడిపోతే మాత్రం దిద్దుబాటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వెండి ఫ్యూచర్ 24 డాలర్ల దిగువన ఉంది. ప్లాటినమ్ 0.2 శాతం పడిపోయి 958.73 డాలర్ల వద్ద ఉంది.

నిల్వలు
ప్రపంచ అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ SPDR గోల్డ్ ట్రస్ట్ వద్ద బంగారం నిల్వలు 0.2 శాతం పెరిగి 1,000.21 టన్నులుగా నమోదయ్యాయి. గత శుక్రవారం 998.17 టన్నులుగా ఉండగా, సోమవారానికి 1,000.21 టన్నులకు పెరిగాయి. ఫెడ్ రిజర్వ్ మీటింగ్ సెప్టెంబర్ 21-22 తేదీల్లో ఉంది. దీనికి ముందే అమెరికా ద్రవ్యోల్భణ డేటా రానుంది. గోల్డ్ ట్రేడర్స్ ఈ రెండింటిపై దృష్టి సారించారు.

బంగారంపై వీటి ప్రభావం
అగ్రరాజ్యం అమెరికాలో సెప్టెంబర్ 3వ తేదీతో ముగిసిన వారంలో కొత్త జాబ్-లెస్ బెనిఫిట్ క్లెయిమ్స్ భారీగా తగ్గాయి. కరోనా సమయంలో 3,10,000గా ఉన్న ఈ క్లెయిమ్స్ ఇప్పుడు 35,000కు పడిపోయాయి. అలాగే, డాలర్ వ్యాల్యూ పెరుగుతోంది. డాలర్ వ్యాల్యూ గతవారం 0.18 శాతం పెరిగి 92.64కు చేరుకుంది. గతవారంలో అయితే 0.66 శాతం ఎగిసింది. 92.86తో గరిష్టాన్ని తాకింది. అమెరికా 10 ఇయర్ ట్రెజరీ యీల్డ్స్ భారీగా పుంజుకొని, గతవారంలో 1.343 శాతానికి చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications