న్యూఢిల్లీ: బంగారం ధరలు నేడు (ఫిబ్రవరి 12, శుక్రవారం) దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఫ్యూచర్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి రూ.47,500 దిగువకు వచ్చాయి. వెండి ధరలు మాత్రం రూ.800కు పైగా పెరిగి, రూ.69వేలను క్రాస్ చేశాయి. రిటైల్ మార్కెట్ విషయానికి వస్తే దేశ రాజధాని ఢిల్లీలో బంగారం రూ.600కు పైగా క్షీణించి రూ.46,847 పలికింది. వెండి రూ.350 వరకు తగ్గి రూ.67,900 వద్ద ఉంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గడం, రూపాయి విలువ స్వల్పంగా కోలుకోవడం దేశంలో పసిడి ధరల తగ్గుదలకు కారణంగా చెబుతున్నారు. డాలర్ విలువ పెరగడంతో అంతర్జాతీయంగా పసిడిపై ఒత్తిడి తగ్గిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

రూ.47,500 దిగువనే పసిడి
బంగారం రూ.47,500 దిగువనే ఉన్నాయి. ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.46.00 (-0.10%) తగ్గి రూ.47,462.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,411.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,586.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,111.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9000 వరకు తక్కువగా ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.81.00 (0.17%) తగ్గి రూ.47,587 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,635.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,725.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,300.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.70వేల దిగువనే సిల్వర్
నిన్న తగ్గిన వెండి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. వెండి రూ.70వేల దిగువనే ఉంది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.809.00 (1.18%) పెరిగి రూ.69,301.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,506.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,500.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,330.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా కిలో రూ.659.00 (0.95%) పెరిగి రూ.70,350.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,646.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,593.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,500.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

గోల్డ్ ఫ్యూచర్స్ స్థిరంగా
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర నిన్న, ఇవాళ తగ్గాయి. నేడు ఔన్స్ 1830 డాలర్ల దిగువకు వచ్చింది. నేడు గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ -0.60 (-0.03%) డాలర్లు తగ్గి 1826.20 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,810.25 - 1,831.35 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 14.46 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ పెరిగింది. ఔన్స్ ధర 0.380 (1.40%) డాలర్లు తగ్గి 27.427 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.913 - 27.500 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 52.62 శాతం పెరిగింది.
More From GoodReturns

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications