బంగారం, వెండి ధరలు ఈ రోజు (ఆగస్ట్ 20, గురువారం) మరింతగా తగ్గాయి. ఎంసీఎక్స్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.300 తగ్గి రూ.52,320 చేరుకుంది. వెండి కిలో 0.8 శాతం పడిపోయి రూ.67,440 పలికింది. అంతకుముందు సెషన్‌లలో పసిడి రూ.వెయ్యికి పైగా క్షీణించగా, నిన్నటి సెషన్‌లో వెండి కిలో రూ.1500 వరకు పడిపోయింది. పసిడి ధరలు పదిహేను రోజుల క్రితం రూ.57వేల రికార్డ్‌కు చేరుకున్నాయి. నాటి ధరతో పోలిస్తే భారీగా తగ్గింది. వెండి ఓ సమయంలో రూ.75 వేల పైకి చేరుకుంది. ఇప్పుడు రూ.67వేలకు చేరుకుంది. బంగారం ధరలు రెండు రోజుల్లో రూ.1200కు పైగా తగ్గాయి.

హైదరాబాద్‌లో తగ్గిన పసిడి ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధరలు రూ.600కు పైగా పడిపోయి రూ.54,270 పలికింది. అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో వెండి ధర రూ.3,000కు పైగా పడిపోయి రూ.69,500 వరకు పలికింది. హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్లలో 24 క్యారెట్ల పసిడి ధరలు రూ.56 వేల(రూ.56,250) పైకి చేరుకున్నాయి. 22 క్యారెట్ల పసిడి రూ.51,600 సమీపానికి చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లో స్వల్ప పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్లో పసడి ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. గత వారం కంటే నిన్నటి వరకు ధరలు 3.5 శాతం వరకు పడిపోయాయి. ఈ రోజు స్పాట్ గోల్డ్ 0.5 శాతం పెరిగి ఔన్స్ ధర 1,90 డాలర్లు పలికింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి ఔన్స్ 0.8 శాతం పెరిగి 26.94 డాలర్లు పలికింది. ప్లాటినమ్ 0.3 శాతం పెరిగి 934.01 డాలర్లు చేరుకుంది. ఆ తర్వాత యూఎస్ ఫెడ్ ప్యాకేజీకి మొగ్గు చూపిన నేపథ్యంలో బంగారంపై ప్రభావం పడనుంది.

మరికొద్దిరోజులు అస్థిరంగానే..
బంగారం, వెండి ధరలు మరికొద్ది రోజులు అస్థిరంగా కొనసాగే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రష్యా కరోనా వ్యాక్సీన్‌పై అనుమానాలు, వివిధ దేశాల వ్యాక్సీన్ల రాకపై క్లారిటీ లేకపోవడం ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఎంసీఎక్స్‌లో పసిడి 52,220-51,800 మద్దతు, రూ.52,800 పైకి చేరుకుంటే రూ.53,100 నుండి రూ.53,350కు చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications