నిన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు, నేడు (శుక్రవారం, 11) కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న రూ.49,000కు అడుగు దూరంలో నిలిచిన గోల్డ్ ఫ్యూచర్స్, నేడు ఆ స్థాయిని తాకకుండానే క్షీణించాయి. సూచీల ఊగిసలాట, ఈటీఎఫ్ ఇన్-ఫ్లో, అంతర్జాతీయ సరిహద్దు ఉద్రిక్తతలు, ద్రవ్యోల్భణం వంటి ఆందోళనలు, టెన్ ఇయర్ బాండ్ యీల్డ్స్ వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి. 10 ఇయర్ బాండ్ యీల్డ్స్ రెండేళ్ల గరిష్టాన్ని తాకాయి. ఇటీవల ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వార్తలతో బంగారం ధరలు పడిపోయాయి. కానీ అంతలో ద్రవ్యోల్భణం వంటి వివిధ ఆందోళనలు పసిడి పరుగుకు కారణం అయ్యాయి. అయితే, ఇప్పుడు మళ్లీ తగ్గుతున్నాయి.

నిన్న ధరలు భారీగా జంప్
గోల్డ్ ఫ్యూచర్స్ నిన్నటి సెషన్‌లోనే రూ.49,000ను సమీపించింది. కేవలం రూ.10 దూరంలో గరిష్టాన్ని తాకింది. నిన్నటి సెషన్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.314 లేదా 0.65 శాతం లాభపడి రూ.48,974 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.313 లేదా 0.64 శాతం పెరిగి రూ.49,120 వద్ద ముగిసింది. క్రితం సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఓ సమయంలో రూ.48,990ని తాకింది.వెండి కూడా భారీగానే పెరిగింది. ఇది రూ.63,000 క్రాస్ చేసింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.537 పెరిగి రూ.63,225 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.558 పెరిగి రూ.64,059 వద్ద ట్రేడ్ అయింది.

గోల్డ్ ఫ్యూచర్స్
ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు రూ.200కు పైగా తగ్గింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.229 క్షీణించి రూ.48,726 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.187 తగ్గి రూ.48,859 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 12.25 డాలర్లు తగ్గి 1825 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1837 డాలర్ల వద్ద ముగిసింది.

సిల్వర్ ఫ్యూచర్స్
సిల్వర్ ఫ్యూచర్స్ కూడా భారీగానే తగ్గింది. నిన్న 63,000 పైకి చేరుకున్న సిల్వర్ ఫ్యూచర్స్ నేడు 62,000 స్థాయికి పడిపోయింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.925 తగ్గి రూ.62,341 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.851 తగ్గి రూ.63,200 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.477 డాలర్లు తగ్గి 23.047 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం



Click it and Unblock the Notifications