బంగారం ధరలు ఇటీవల భారీగా తగ్గుతున్నాయి. క్రితం సెషన్‌లో ఏకంగా రూ.643 పడిపోయింది. కానీ నేడు మళ్లీ పెరిగింది. నిన్నటి ముగింపు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో దాదాపు రూ.5300 తక్కువగా ఉంది. ఇటీవలి రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్త పరిస్థితుల గరిష్టంతో పోలిస్తే రూ.4500కు పైగా తక్కువగా ఉంది. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51,000 దిగువకు వచ్చింది. కానీ దాదాపు నెల రోజుల కనిష్టానికి పడిపోయింది. కానీ నేడు ప్రారంభ సెషన్‌లో మళ్లీ పెరిగింది. రూ.51,000 దాటింది. రష్యా-ఉక్రెయిన్ పరిణామాలు కాస్త సానుకూలంగా కనిపిస్తున్నాయి. డాలర్, బాండ్ యీల్డ్స్ పెరుగుతున్నాయి. దీంతో పసిడి ధరలు నెల రోజుల కనిష్టానికి పడిపోయింది.
పసిడి ధరలు క్రితం సెషన్‌లో రూ.50,950 దిగువన ముగిశాయి. అయితే నేడు (మార్చి 30) ప్రారంభ సెషన్‌లోనే రూ.201 పెరిగి రూ.51,014 వద్ద ట్రేడ్ అయింది. నేడు రూ.50,979 వద్ద ప్రారంభమై, రూ.51,049 వద్ద గరిష్టాన్ని, రూ.50,811 వద్ద కనిష్టాన్ని తాకింది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.239 పెరిగి రూ.51,528 వద్ద ట్రేడ్ అయింది. ఇక సిల్వర్ ఫ్యూచర్స్ కూడా క్రితం సెషన్‌లో రూ.67,000 దిగువకు పడిపోయినప్పటికీ, నేడు రూ.334 ఎగిసి రూ.67,281 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1915 డాలర్లకు పడిపోయింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాటి ముందుస్థాయికి పడిపోయింది. నేడు దాదాపు 12 డాలర్లు ఎగిసి 1924 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో 1,914.50 - 1,924.80 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1,912.20 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.284 డాలర్లు ఎగిసి 25.020 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications