బంగారం ధరలు నేడు (మంగళవారం, జూలై 6) భారీగా పెరిగాయి. వెండి ధరలు అదే స్థాయిలో పడిపోయాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.500కు పైగా పెరిగి చాలా రోజుల తర్వాత రూ.48,000 తాకింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.500 మేర తగ్గి రూ.70,000 దిగువకు వచ్చింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.8700 తక్కువగా ఉంది. ఈ నెల ప్రారంభంలో రూ.47వేల దిగువకు పడిపోయిన బంగారం ఇప్పుడు మళ్లీ రూ.48,000ను తాకింది. ఈ కొద్ది రోజుల్లోనే రూ.1000కి పైగా పెరిగింది.

భారీగా పెరిగిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో రూ.421.00 (0.89%) పెరిగి రూ.47720.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,350.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,000.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.47,350.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.434.00 (0.91%) పెరిగి రూ.48000.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,744.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,290.00 గరిష్టాన్ని, రూ.47,730.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధరలు డౌన్
సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.499.00 (-0.71%) తగ్గి రూ.69540.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,309.00 వద్ద ప్రారంభమై, రూ.70,960.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.69,455.00 వద్ద కనిష్టాన్ని తాకింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.414.00 (-0.58%) తగ్గి రూ.70980.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,650.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.72,151.00 గరిష్టాన్ని, రూ.70,850.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 10.75 (0.60%) డాలర్లు పెరిగి 1,794.05 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,790.85 - 1,815.70 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ తగ్గింది. 0.271 (-1.02%) డాలర్లు తగ్గి 26.230 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.203 - 26.907 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications