గతవారం భారీగా పెరిగిన బంగారం ధరలు ఈ వారం దాదాపు స్థిరంగా ప్రారంభమయ్యాయి. నేడు (డిసెంబర్ 20) ప్రారంభ సెషన్‌లో రూ.48,600 స్థాయిలో ఉన్నాయి. గతవారం చివరి సెషన్‌లో పసిడి ధరలు మూడు వారాల గరిష్టాన్ని తాకాయి. ఎంసీఎక్స్‌లో గత వారం ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,700 స్థాయిలో కనిపించింది. అయితే స్వల్పంగా తగ్గింది. ఒమిక్రాన్ మహమ్మారి విస్తరించడం, వినియోగ డిమాండ్ పెరగడం వంటి అంశాలు బంగారం ధరల పెరుగుదలకు కారణమయ్యాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత కొద్ది నెలలుగా భారత్‌లో ఫిజికల్ గోల్డ్ డిమాండ్ పెరుగుతోంది.

బంగారం ధర ఇలా
నేటి ప్రారంభ సెషన్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.12.00 (-0.02%) క్షీణించి రూ.48582.00 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.23.00 (-0.05%) క్షీణించి రూ.48682.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కు 2.55 (-0.14%) డాలర్లు క్షీణించి 1,802.35 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్లో గోల్డ్ 1805 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో గోల్డ్ ఫ్యూచర్స్ 5.40 శాతం తగ్గింది.

వెండి ధరలు
వెండి ధరలు రూ.62,000 దిగువకు వచ్చాయి. క్రితం వారం రూ.60,000 స్థాయిలో ఉన్న వెండి ధరలు ఆ తర్వాత రూ.62,000 క్రాస్ చేశాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఈ మార్కు దిగువకు చేరుకున్నాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.61,662, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.62,290 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ ఏడాదిలో 14 శాతం మేర తగ్గింది.

బంగారం ధరలు..
ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో యూఎస్ రియల్ యీల్డ్స్ క్షీణించాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూస్తున్నారు. దీంతో పసిడి ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధరలు ఈ వారం దాదాపు స్థిరంగా ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. 1800 డాలర్ల వద్ద బలమైన నిరోధకం కనిపిస్తోందని, అంటే దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో రూ.48,600 స్థాయిలో నిరోధకం కనిపిస్తోందని అంటున్నారు. అయితే 2022లోకి మాత్రం భారీ పెరుగుదలతో అంటే 1835 డాలర్ల స్థాయిలో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంటే మన వద్ద రూ.50,000 క్రాస్ చేస్తుంది.
More From GoodReturns

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications