బంగారం ధరలు ఈ వారం అతి స్వల్ప లాభాల్లో లేదా స్థిరంగా ప్రారంభం అయ్యాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వారం కూడా కాస్త సానుకూలంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో స్టాక్ మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ కొనసాగే అవకాశాలున్నాయి. నేడు (నవంబర్ 1, సోమవారం) డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.40.00 (0.08%) పెరిగి రూ.47675.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.95.00 (0.20%) ఎగిసి రూ.47750.00 ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు పెరిగాయి. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1.95 (+0.11%) డాలర్లు లాభపడి 1,785.85 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ గతవారమే 1800 డాలర్ల దిగువకు వచ్చింది. కానీ నేటి సెషన్‌లో స్వల్పంగా లాభపడింది. గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో 1,780.45 - 1,788.45 డాలర్ల మధ్య కదలాడింది. 52 వారాల కరిష్టం 1677.90 డాలర్లు. 52 వారాల గరిష్టం 1978.40 డాలర్లు. క్రితం సెషన్‌లో 1784 వద్ద క్లోజ్ అయింది. ఆల్ టైమ్ గరిష్టంతో బంగారం రూ.8500 తక్కువగా ఉంది.

ఏడాదిలో తగ్గుదల ఎంతంటే
గతవారం రూ.65,000ను క్రాస్ చేసిన డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ వారాంతానికి ఈ మార్కు దిగువకు చేరుకుంది. నేటి ప్రారంభ సెషన్‌లో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.44.00 (-0.07%) లాభపడి రూ.64490.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.44.00 (-0.07%) లాభపడి రూ.65230.00 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో 23.808 - 23.983 డాలర్ల మధ్య కదలాడింది. 52 వారాల గరిష్టం 29.930 డాలర్లు, కనిష్టం 21.410 డాలర్లు. క్రితం సెషన్‌లో 23.949 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో వెండి ధర 0.83 శాతం తగ్గింది. అదే బంగారం ధర ఏడాదిలో 6 శాతం మేర క్షీణించింది.

దీపావళి సమయంలో...
గత ఏడాది దీపావళి సమయంలో ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధర రూ.50,000 పైన ఉంది. ఈసారి మాత్రం రూ.48,000 దిగువన ఉంది. గత రెండు మూడు వారాలుగా పసిడి ధరలు పెరగడం వల్ల ఈ స్థాయికి వచ్చింది. లేదంటే రూ.46,000 స్థాయిలోనే ఉండేది. వచ్చే ఏడాది దీపావళి నాటికి బంగారం ధరలు రూ.54,000కు చేరుకోవచ్చునని మార్కెట్ వర్గాల అంచనా. బులియన్ మార్కెట్, స్టాక్ మార్కెట్ పైన ఈ వారం ఫెడ్ రిజర్వ్ ద్రవ్యోల్భణం, డాలర్ మారకం, కరోనా కేసులు వంటి వివిధ అంశాలు ప్రభావం చూపనున్నాయి.

మద్దతు ధర
ఎంసీఎక్స్‌లో బంగారం నిరోధకస్థాయి ధర రూ.47,800-48,000. మద్దతు ధర రూ.47,400-47,150గా బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా. అయితే గోల్డ్ ఫ్యూచర్స్ మరికొన్నాళ్లు రూ.48,000కు దిగువనే ట్రేడ్ కావొచ్చునని భావిస్తున్నారు. వివిధ నగరాల విషయానికి వస్తే 24 క్యారెట్ల బంగారం ఢిల్లీలో రూ.51,000, చెన్నైలో రూ.49,200, హైదరాబాద్48,800గా ఉంది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications