Gold price today: తగ్గిన బంగారం ధరలు, వెండి ధరలు మాత్రం పైకి
నిన్నటి వరకు పెరిగిన బంగారం ధరలు నేడు (జూలై 16, శుక్రవారం) ప్రారంభ సెషన్‌లో స్వల్పంగా తగ్గాయి. అయినప్పటికీ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000కు పైనే ఉంది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.16.00 (0.03%) క్షీణించి రూ.48384.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,378.00 వద్ద ప్రారంభమై, రూ.48,389.00 గరిష్టాన్ని, రూ.48,365.00 వద్ద కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 21.00 (-0.04%) తగ్గి రూ.48654.00 వద్ద ట్రేడ్ అయింది.
బంగారం ధరలు స్వల్పంగా క్షీణించగా, వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఉదయం సెషన్లో రూ.189.00 (0.27%) పెరిగి రూ.69870.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,906.00 ప్రారంభమైన ధర, రూ.69,931.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,854.00 వద్ద కనిష్టాన్ని తాకింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.284.00 (0.40%) పెరిగి రూ.71146.00 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధర తగ్గింది. వెండి పెరిగింది. 1830 డాలర్లకు పైగా ట్రేడ్ అయిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు ఆ స్థాయిదిగువకు వచ్చింది. గోల్డ్ ఫ్యూచర్స్ 0.85 (0.05%) డాలర్లు తగ్గి 1,828.15 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.086 (0.33%) డాలర్లు పెరిగి 26.480 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications