బంగారం ధరలు నేడు (అక్టోబర్ 13, బుధవారం) స్థిరంగా ఉన్నాయి. ఉదయం సెషన్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 8.00 (-0.02%) నష్టపోయి రూ.47190.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.14.00 (0.03%) లాభపడి రూ.47396.00 వద్ద ప్రారంభమైంది. బంగారం ధరలు నేడు రూ.47,215.00 వద్ద ప్రారంభమై, రూ.47,218.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,172.00 వద్ద కనిష్టాన్ని తాకాయి. సిల్వర్ ఫ్యూచర్స్ డిసెంబర్ రూ.232 పెరిగి రూ.61,818 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.224 లాభపడి రూ.62299.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు లాభపడింది. నేటి సెషన్‌లో 3.75 డాలర్లు లాభపడి 1763 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.181 డాలర్లు ఎగిసి 22.695 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇక గోల్డ్ ఫ్యూచర్స్ నిన్నటి సెషన్‌లోను స్వల్పంగా పెరిగింది. క్రితం సెషన్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.159 పెరిగి రూ.47,210 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగి 1760 డాలర్లను క్రాస్ చేసింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్‌లో అతి స్వల్పంగా క్షీణించి రూ.61,600 వద్ద, కామెక్స్‌లో 22.683 డాలర్ల వద్ద ముగిసింది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఏడాదిలో 9.71 శాతం క్షీణించింది.
బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో ప్రస్తుతం రూ.9000 తక్కువగా ఉంది. ఎంసీఎక్స్‌లో బంగారం ప్రస్తుతం రూ.47,200 వద్ద ఉంది. మద్దతు దర రూ.46700 - రూ.46170 నిరోధకస్థాయి రూ.47500. స్టాక్ మార్కెట్, బంగారం ధరలు కరోనా కేసులు, ఆయా దేశాల వృద్ధి అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ఇటీవల వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్‌లో వివిధ దేశాల వృద్ధి అంచనాలు ఇలా ఉన్నాయి.

ప్రపంచ ఔట్ పుట్ 2021లో 5.9 శాతం, 2022లో 4.9 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చునని అంచనా వేసింది. ఆయా దేశాల విషయానికి వస్తే 2021లో అమెరికా 5.2 శాతం, 2.22లో 4.5 శాతం, యూరో ఏరియా 5.0 శాతం, 5.2 శాతం, జర్మనీ 3.1 శాతం, 4.6 శాతం, ఫ్రాన్స్ 6.3 శాతం, 3.9 శాతం, ఇటలీ 5.8 శాతం, 4.2 శాతం, స్పెయిన్ 5.7 శాతం, 6.4 శాతం, జపాన్ 2.4 శాతం, 3.2 శాతం, యూకే 6.8 శాతం, 5.0 శాతం, కెనడా 5.7 శాతం, 4.9 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఎమర్జింగ్ అండ్ డెవలపింగ్ ఏషియా దేశాల వృద్ధి రేటు 2.21లో 7.2 శాతం, 2022లో 6.3 శాతం, చైనా 8.0 శాతం, 5.6 శాతం, ఇండియా 9.5 శాతం, 8.5 శాతంగా అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications