For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్థిరంగానే బంగారం ధర, 10 గ్రాముల బంగారం 45 వేలు, కాస్త తగ్గిన వెండి ధర..

|

కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాల్లో భయాందోళన నెలకొన్న.. బంగారం ధర మాత్రం స్థిరంగానే ఉంది. భారతీయ మార్కెట్‌లో బంగార ధర స్టేబుల్‌గా ఉండగా.. వెండి రేట్ మాత్రం కాస్త తగ్గింది. కిలో వెండి ధర రూ.90 తగ్గింది. ముంబై బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.45 వేల 894 పలికింది. దీనికి 3 శాతం జీఎస్టీ అదనం. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం రూ.42 వేల 39 ఉంది. దీనిని కూడా 3 శాతం జీఎస్టీ వడ్డీస్తారు. 18 క్యారట్ల 10 గ్రాముల బంగారం మాత్రం 34 వేల 420 వద్ద ఉంది.

కొమెక్స్ బంగారం ధర స్థిరంగా ఉంది అని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ వీపీ హెడ్ రవీంద్ర రావు పేర్కొన్నారు. కరోనా వైరస్ రెండో స్టేజీ రావడంతో బంగారం ధరలు పెరిగాయని ఓస్వాల్ ఉపాధ్యక్షుడు నవనీద్ దమాని తెలిపారు. కిలో వెండి ధర రూ.90 తగ్గి 42 వేల 915కి చేరింది.

Gold price steady at Rs 45,894, silver slips

ప్యూచర్ మార్కెట్‌లో బంగారం గరిష్టంగా 45 వేల 779కి చేరింది. ఎంసీఎక్స్‌లో కనిష్టంగా 45 వేల 501కి చేరింది. జూన్‌లో ఇది 47 వేల మార్క్ చేరుకోబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు నాటికి 46 వేల చేరుకోబోతుందని లెక్క గడుతున్నారు. బంగారం వ్యాపారం జూన్‌లో 2040 కోట్లు ఉండనుండగా.. ఆగస్టులో 173.51 కోట్లుగా ఉండనుంది.

English summary

స్థిరంగానే బంగారం ధర, 10 గ్రాముల బంగారం 45 వేలు, కాస్త తగ్గిన వెండి ధర.. | Gold price steady at Rs 45,894, silver slips

Gold prices remained flat at Rs 45,894 per 10 gram in the Mumbai bullion market as participants waited for US Federal Reserve Chairman Jerome Powell’s speech.
Story first published: Wednesday, May 13, 2020, 19:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X