For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర

|

దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం క్షీణించగా, వెండి ధరలు పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్ ధరలు నిన్న రూ.160.00 (-0.32%) క్షీణించి రూ.50,552 వద్ద క్లోజ్ అయ్యాయి. శుక్రవారం ఉదయం రూ.50,586 వద్ద ట్రేడింగ్ ప్రారంభించి, రూ.50,813 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.50,452 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే ఫ్యూచర్ మార్కెట్లో రూ.5,648 తగ్గింది.

తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర

తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర

ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.146.00 (-0.29%) క్షీణించి 10 గ్రాముల పసిడి ధర రూ.50615.00 వద్ద ముగిసింది. శుక్రవారం ఉదయం రూ.50,811.00 వద్ద ప్రారంభమై, రూ.50,931 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.50,605 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ఫ్యూచర్స్ మాత్రం పెరిగింది. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ కిలో రూ.118(0.19 శాతం) పెరిగి రూ.61,653 పలికింది. రూ.62,170 వద్ద గరిష్టాన్ని, రూ.61,324 వద్ద కనిష్టాన్ని తాకింది. అదే సమయంలో మార్చి ఫ్యూచర్స్ క్షీణించింది. మార్చి ఫ్యూచర్స్ రూ.54 (0.09 శాతం) తగ్గి కిలో రూ.61,193 పలికింది. శుక్రవారం రూ.63,800 వద్ద గరిష్టాన్ని, రూ.62,976 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో అదే ధోరణి

అంతర్జాతీయ మార్కెట్లో అదే ధోరణి

అంతర్జాతీయ మార్కెట్లోను అదే ధోరణి కొనసాగింది. గోల్డ్ ఫ్యూచర్స్ క్షీణించగా, వెండి ఫ్యూచర్స్ పెరిగింది. డిసెంబర్ గోల్డ్ ఔన్స్ ధర 0.32 శాతం తగ్గి 1,902.80 డాలర్లు పలికింది. 1,901.25 - 1,918.55 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్‌లో 1908.90 డాలర్ల వద్ద ముగిసింది.

వెండి ఫ్యూచర్స్ 0.25 శాతం పెరిగి 24.285 డాలర్ల వద్ద ముగిసింది. 24.188 - 24.657 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్‌లో 24.433 డాలర్ల వద్ద క్లోజ్ అయింది.

బులియన్ మార్కెట్లో ధర

బులియన్ మార్కెట్లో ధర

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం బులియన్ మార్కెట్లో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.52,940 పలికింది. 22 క్యారెట్ల పసిడి రూ.48,530 పలికింది. వెండి ధర కిలో రూ.600 పెరిగి రూ.61 పైకి చేరుకుంది. అమెరికా ఆర్థిక ప్యాకేజీ అంశం నేపథ్యంలో పసిడి ధరలు తగ్గాయి. నాణేల తయారీదారుల నుండి డిమాండ్ పుంజుకోవడంతో వెండి ధరలు పెరిగాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగింది.

English summary

అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర | Gold Price Stands at Rs 50,540, Silver Costs Rs 61,700

The price of 24-carat gold today moved up by Rs 10, from Rs 50,530 per 10 gram to Rs 50,540 per 10 gram.
Story first published: Saturday, October 17, 2020, 18:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X